Eesha Rebba స్టార్ హీరో సినిమాల్లో కొందరు హీరోయిన్స్ కు అనుకోని ఇబ్బందులు కలుగుతాయి. సినిమాలో సెకండ్ హీరోయిన్ అని చెప్పి తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే అదేదో సైడ్ క్యారెక్టర్ లా కనిపిస్తుంది తప్ప అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర ఉండదు. ఇలాంటి అనుభూతే తనకు కలిగిందని అంటుంది తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో తెరంగేట్రం చేసిన ఈషా రెబ్బ యువ హీరోలతో నటిస్తూ మెప్పిస్తుంది.
అయితే తన కెరీర్ లో ఎన్టీఆర్ సినిమాలో నటించే ఛాన్స్ రాగా ముందు కాస్త డౌట్ పడినా మేకర్స్ తనని ఒప్పించారని చెప్పింది. అయితే ఆ సినిమాలో నటించి తప్పుచేశానని అంటుంది ఈషా రెబ్బ. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈషా రెబ్బ ఎన్టీఆర్ చేసిన అరవింద సమేత సినిమా చేయకుండా ఉంటే బాగుండేదని అంటుంది.
ఎన్టీఆర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ అని చెప్పి ఆఫర్ ఇచ్చారు. ఒక సాంగ్ కూడా ఉంటుందని అన్నారు. కానీ సినిమా అయ్యాక చూస్తే అవేవి లేకుండానే రిలీజ్ చేశారు. సినిమా ఛాన్స్ ఇచ్చేప్పుడు త్రివిక్రం గారు ఎన్టీఆర్ తో సినిమా అంతకన్నా ఏం కావాలని కన్విన్స్ చేశారు.
సినిమాలో మీది సెకండ్ హీరోయిన్ పాత్ర అని అన్నారు. తనకు సినీ పరిశ్రమలో ఎవరు తెలియకుండానే ఈ స్థాయికి వచ్చాను. కొన్నిసార్లు ధైర్యంగా ముందు కెళ్లడానికి తన వెనక సపోర్ట్ ఎవరు లేరు అనే భావన కలుగుతుందని అన్నది.ఎన్టీఆర్ సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అని ఈషా చేసిన కామెంట్స్ ని తారక్ ఫ్యాన్స్ మాత్రం డిఫరెంట్ గా రెస్పాండ్ అవుతున్నారు.
Also Read : Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’లో మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయో తెలుసా..?