Site icon HashtagU Telugu

Pushpa 2 : పుష్ప 2 నుంచి అతను ఎగ్జిట్.. ఇది అసలు ఊహించలేదు.. అనుకున్న టైమ్ కి వస్తుందా లేదా..?

Pushpa 2

Pushpa 2

Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప 1 సూపర్ సూపర్ హిట్ తర్వాత వస్తున్న పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో సినిమాను త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ అంతా కష్టపడుతున్నారు. అయితే సుకుమార్ కి షాక్ ఇస్తూ ఈ సినిమా నుంచి ఒకరు ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. అదేంటి రిలీజ్ కి వస్తున్న సినిమా నుంచి బయటకు వెళ్లడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. కానీ తప్పడం లేదని తెలుస్తుంది.

ఇంతకీ పుష్ప 2 నుంచి బయటకు వచ్చింది ఎవరు అంటే ఎడిటర్ ఆంటోని రూబెన్ అని తెలుస్తుంది. పుష్ప 1కి అతనే ఎడిటర్ గా పనిచేశాడు. పుష్ప 1 హిట్ లో ఆంటోని ఎడిటింగ్ కూడా వన్ ఆఫ్ ది హైలెట్స్ అని చెప్పొచ్చు. పుష్ప 2 కి కూడా ఆంటోని పనిచేయాల్సి ఉన్నా తను వేరే వర్క్స్ లో బిజీ ఉండటం వల్ల సినిమా నుంచి ఎగ్జిట్ అవుతున్నాడని తెలుస్తుంది.

ఆంటోని రూబెన్ కి బదులుగా నవీన్ నూలిని పుష్ప 2 ఎడిటర్ గా తీసుకున్నారని టాక్. ఆంటోని రూబెన్ జవాన్ సినిమాకు కూడా ఎడిటర్ గా పనిచేశాడు. ప్రస్తుతం అతను వరుణ్ ధావన్ బేబీ జాన్ కి ఎడిటర్ గా చేస్తున్నాడు. ఇక నవీన్ నూలి విషయానికి వస్తే సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు అతనే ఎడిటర్ గా చేశాడు. అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాకు కూడా నవీన్ నూలి ఎడిటింగ్ చేశాడు.

సో సూపర్ హిట్ కాంబో కాబట్టి కచ్చితంగా పుష్ప 2 మీద ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. పుష్ప 2 పై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుక్కు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.

Also Read : Deepti Sunaina Shadow Glamour Treat : దీప్తి సునైనా షాడో గ్లామర్ ట్రీట్.. ఈ దాగుడుమూతలు ఎందుకో..?