Site icon HashtagU Telugu

ED Investigation: బెట్టింగ్ యాప్ కేసు.. సెలబ్రిటీలకు నోటీసులు!

ED Investigation

ED Investigation

ED Investigation: బెట్టింగ్ యాప్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED Investigation) దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ప్రముఖ సినీ తారలను విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. జూలై చివరి వారం నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఈ విచారణలు జరగనున్నాయి. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి, నటుడు ప్రకాష్ రాజ్‌, మంచు లక్ష్మిని విచార‌ణ‌కు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు పంపింది.

నోటీసులు అందుకున్న ప్రముఖులు

విచారణ ఎందుకు?

ఈ సెలబ్రిటీలకు అక్రమ బెట్టింగ్ యాప్‌ల మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా లేదా అని ఈడీ ప్రధానంగా పరిశీలిస్తోంది. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం, వాటి ద్వారా వచ్చిన ఆదాయం, ఇతర ఆర్థిక సంబంధాలపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈడీ సమన్లు అందుకున్న వీరు ఇప్పటికే తమ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు స‌మాచారం.

Also Read: Asia Cup 2025: ఆసియా క‌ప్ ఎఫెక్ట్‌.. అధ్యక్ష పదవి నుంచి నక్వీ ఔట్‌?!

ఈ విచారణల్లో సెలబ్రిటీలు ఇచ్చే వాంగ్మూలాలు, వారు సమర్పించే ఆర్థిక వివరాల ఆధారంగా ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగనుంది. ఈ విచారణల తర్వాత మరికొందరు ప్రముఖులకు నోటీసులు వెళ్లే అవకాశం ఉందా? లేదా ఈ ముగ్గురి విచారణతోనే కేసు ఒక కొలిక్కి వస్తుందా అనేది వేచి చూడాలి. బెట్టింగ్ యాప్ కేసులో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, ప్రణీత, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి, శోభా శెట్టి, అమృతా చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత, మ‌రి కొంత‌మంది ఈడీ విచార‌ణ ప‌రిధిలో ఉన్న‌ట్లు స‌మాచారం.