Site icon HashtagU Telugu

Eagle : అవకాశం ఉన్నా వాడుకోలేదు.. నార్మల్ రేట్లకే ఈగల్ టికెట్లు.. రీజన్ అదే..!

Raviteja Eagle OTT Deal Close ETv Win Bought Digital Rights

Raviteja Eagle OTT Deal Close ETv Win Bought Digital Rights

Eagle మాస్ మహారాజ్ రవితేజ కార్తీక్ ఘట్టమనేని ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈగల్ సినిమా మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిచిన ఈ సినిమాలో అనుపమ, కావ్య తాపర్ హీరోయిన్స్ గా నటించారు. దేవ్ జాండ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలరించనుంది.

ఇక స్టార్ సినిమా అంటే రిలీజ్ టైం లో సాధ్యమైనంత వరకు లాక్కొచ్చేద్దాం అన్నట్టు ఉంటుంది. అందుకే స్టార్ సినిమాల రిలీజ్ టైం లో ప్రభుత్వంతో ప్రత్యేకంగా టికెట్ రేటులను అధికంగా అమ్ముకునేందుకు జీవో తీసుకుంటారు. అయితే ఈగల్ సినిమాకు అలాంటి అవకాశం ఉన్నా కూడా అది వాడుకోలేదని తెలుస్తుంది.

మల్టీప్లెక్స్ లో 290, సింగిల్ స్క్రీన్స్ లో 200 వరకు టికెట్ రేటు పెంచే అవకాశం ఉన్నా సరే ఈగల్ నిర్మాతలు అలా ఏమి వద్దు ఎప్పటిలానే సిగిల్ స్క్రీన్ 250, మల్టీప్లెస్ 200 అలా టికెట్ రేట్లని ఫిక్స్ చేశారు. ఇలా చేయడం వల్ల నిర్మాతలకు నష్టమే కానీ ఎక్కువమంది ప్రేక్షకులు సినిమా చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రవితేజ సినిమా అంటే మాస్ మహరాజ్ ఫ్యాన్స్ కి పండుగే ఈగల్ తో ఎలాగు టికెట్ రేట్లు కూడా పెంచలేదు కాబట్టి సినిమాను చూసి సూపర్ హిట్ చేస్తారేమో చూడాలి.

Also Read : Sandeep Kishan : భైరవ కోన భలే ప్లాన్ వేశారుగా.. ఆ హిట్ ఫార్ములా కలిసి వస్తుందా..?