Site icon HashtagU Telugu

Dunki Movie: షారుక్‌ఖాన్‌ డంకీ ట్రైలర్‌ రిలీజ్, ఫన్‌ అండ్‌ ఎమోషనల్

Dunki

Dunki

Dunki Movie: జవాన్ మూవీ సక్సెస్ తర్వాత బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ డంకీ మూవీతో రాబోతున్న విషయం తెలిసిందే. విడుదలకు సిద్దమవుతున్న ఈ మూవీ ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయ్యింది. షారుక్‌ఖాన్ వాయిస్‌ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్‌.. మూడు నిమిషాల పాటు సాగింది. ఈ నిడివిలోనే సినిమా స్టోరీ ఏంటో సింపుల్‌గా చెప్పేశారు మేకర్స్‌. ఇందులో ఇంగ్లీష్‌ నేర్చుకుని లండన్‌లో సెటిల్‌ అవ్వాలని కలలు కనే ఓ గ్రామీణ యువకుడి పాత్రలో షారుక్‌ కనిపించాడు.

అతనితో పాటు మరో నలుగురు స్నేహితులు లండన్‌ వెళ్లడం కోసం ఇంగ్లీష్‌ నేర్చుకునేందుకు ప్రయత్నించడం, వీసా రాక ఇబ్బందులు ఎదుర్కోవడం నవ్వు తెప్పించాయి. వీసా ఇంటర్వ్యూల్లో ఫెయిల్‌ కావడంతో ఎలాగైనా లండన్‌ వెళ్లేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ క్రమంలో వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనేది స్టోరీ అన్నట్లుగా ట్రైలర్‌ చూస్తే కనిపిస్తున్నది.

షారుక్‌ఖాన్‌ ఇప్పుడు ఫుల్‌ఫామ్‌లో ఉన్నాడు. పఠాన్‌, జవాన్‌ అంటూ వచ్చి వరస హిట్స్ తనేంటో నిరూపించుకున్నాడు. ఒకే ఏడాదిలో రెండు బ్లాక్‌బస్టర్‌ సినిమాలతో వచ్చిన షారుక్‌.. ఇప్పుడు డంకీతో మూడో హిట్‌ అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీపై అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version