Site icon HashtagU Telugu

Dulquer Salman : దుల్కర్ తో మరో పెద్ద ప్లానింగ్ లో వైజయంతి..!

Dulquer Salman మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరుస సినిమా ఛాన్సులు అందుకుంటున్నాడు. మహానటి కోసం జెమిని గణేషన్ రోల్ చేసిన దుల్కర్ ఆ తర్వాత సీతారామం తో సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు లక్కీ భాస్కర్ అంటూ రాబోతున్నాడు. రీసెంట్ ఆ ప్రభాస్ కల్కి సినిమాలో కూడా దుల్కర్ సర్ ప్రైజ్ రోల్ లో అలరించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో రెండు సినిమాలు చేసిన దుల్కర్ కల్కి కోసం వాళ్లు అడగ్గానే ఒప్పేసుకున్నాడు.

ఇక లేటెస్ట్ ఇంఫర్మేషన్ ప్రకారం దుల్కర్ తో వైజయంతి మూవీస్ మరో సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ప్రేమ ఇష్క్ కాదల్ తో డైరెక్టర్ గా పరిచయమైన పవన్ సాధినేని ఈమధ్య సినిమాల కన్నా వెబ్ సీరీస్ లతో ఎక్కువ కనిపిస్తున్నాడు.

దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ ఒక భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదని అనుకుంటున్నారట. ఆల్రెడీ కల్కి తో 500 కోట్లు బడ్జెట్ సునాయాసంగా పెట్టిన అశ్వనిదత్ మరోసారి అలాంటి భారీ సినిమానే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

Exit mobile version