Site icon HashtagU Telugu

బాబీ దర్శకత్వంలో బాలయ్య, దుల్కర్ కాంబో

Balakrishna Next Movie

Balakrishna Next Movie

Balakrishna Next Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త కాంబినేషన్ కి శ్రీకారం చుట్టనుంది. నందమూరి బాలకృష్ణ నెక్ట్స్ మూవీలో మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి.. ఈ మూడు సినిమాలతో సక్సెస్ సాధించి హ్యాట్రిక్ సాధించారు. వరుస విజయాలతో దూసుకెళుతోన్న బాలయ్య తదుపరి చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత బాబీ చేస్తోన్న ఈ మూవీలో బాలయ్యను చాలా డిఫరెంట్ గా చూపించేలా కథను రెడీ చేశాడని ఇది ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని సమాచారం.

అయితే.. ఈ సినిమాలో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడట. బాలయ్య, దుల్కర్ సల్మాన్ పై వచ్చే సీన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని.. ఆల్రెడీ వీరిద్దరి పై వచ్చే సీన్స్ షూట్ చేశారని తెలిసింది. అయితే.. దుల్కర్ క్యారెక్టర్ ఏంటి..? బాలయ్య క్యారెక్టర్ తో లింకు ఏంటి..? అనేది బయటకు రాలేదు కానీ.. సీన్స్ మాత్రం సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో పొలిటికల్ డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని టాక్. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఏమాత్రం రాజీపడకుండా ఈ మూవీని నిర్మిస్తోంది.

మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కుదిరితే ఏపీలో ఎన్నికల కంటే ముందు విడుదల చేయాలి అనేది మేకర్స్ ఆలోచన. దీనిని దృష్టిలో పెట్టుకునే సినిమాను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేలా షెడ్యూల్స్ వేయడం జరిగిందట. ఇప్పటి వరకు ఎంత వరకు అయ్యిందనేది మేకర్స్ ప్రకటించలేదు కానీ.. దాదాపు యాభైశాతం కంప్లీట్ అయ్యింది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. త్వరలోనే మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ సినిమాతో బాలయ్య డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుడతారేమో చూడాలి.

Also Read: IND vs ENG 2nd Test: వైజాగ్ టెస్టులో రోహిత్ దే ఆధిపత్యం