Site icon HashtagU Telugu

Dulquer Salman : దుల్కర్ కూడా సొంతది వాడేస్తునాడుగా..?

Lucky Bhaskar

Lucky Bhaskar

మలయాళ హీరోనే అయినా తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నాడు. మహానటి, సీతారామం తర్వాత లక్కీ భాస్కర్ అంటూ రాబోతున్నాడు దుల్కర్ సల్మాన్. ఈ సినిమాను వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను శ్రీకర మూవీస్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ ఈ సినిమా నిర్మించారు.

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. సార్ లాంటి సినిమాతో ధనుష్ కి మంచి సక్సెస్ అందించిన వెంకీ అట్లూరి దుల్కర్ తో లక్కీ భాస్కర్ సినిమా చేశాడు. ఐతే తెలుగుతో పాటు తమిళ ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్న దుల్కర్ సల్మాన్ అంతకుముందు తన తమిళ డబ్బింగ్ సినిమాల వల్ల కోలీవుడ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని తెలుసుకుని ఈసారి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ (Lucky Bhaskar) సినిమా తమిళ్ వెర్షన్ లో దుల్కర్ సల్మాన్ సొంతంగా తమిళ్ డబ్ చెప్పాడు.

సినిమా మీద అతనికి ఉన్న కమిట్మెంట్..

ఇదివరకు ఫ్యాన్స్ కి మాటిచ్చిన దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ కి దాన్ని నిలబెట్టుకున్నాడు. ఓ విధంగా సినిమా మీద అతనికి ఉన్న కమిట్మెంట్ ఎలాంటిదో ఇది చూస్తే అర్ధమవుతుంది. దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) ఇప్పటికే మహానటి, సీతారామం తో సక్సెస్ అందుకోగా లక్కీ భాస్కర్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది.

దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను మలయాళంలో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. సినిమాపై దుల్కర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీనాక్షి కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా కనిపిస్తుంది.

Exit mobile version