‘Sita Ramam’ Banned: ‘సీతారామం’ మూవీకి షాక్.. ఆ కంట్రీస్ లో బ్యాన్!

ఆగస్ట్‌లో సినిమాల వర్షం కురుస్తోంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు సైతం విడుదలవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - August 5, 2022 / 04:36 PM IST

ఆగస్ట్‌లో సినిమాల వర్షం కురుస్తోంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు సైతం విడుదలవుతున్నాయి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌ల ‘సీతా రామం’ 1960ల నాటి యుద్ధం నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ ఫిలిం. మిలిటరీ ఆఫీసర్ రామ్ (దుల్కర్), సీతా మహాలక్ష్మి (మృణాల్) ల ప్రేమకథ కళ్లకు కట్టే మూవీ. ఇందులో రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈరోజు విడుదలైన ఈ సినిమా ఇప్పటికే మంచి రివ్యూలను అందుకుంది.

దేశవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి బజ్ వస్తే.. గల్ప్ కంట్రీలో మాత్రం ఈ మూవీకి చుక్కెదురవుతోంది. సీతా రామం UAE, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఒమన్లలో విడుదల చేయకుండా నిషేధించాయి.. మతపరమైన అంశాలే  కారణమంటూ జిసిసి దేశాలు తీవ్ర నిర్ణయం తీసుకున్నాయి. ఆ దృశ్యాలను తొలగించి, మళ్లీ సెన్సార్‌కి దరఖాస్తు చేసుకుని సినిమాను విడుదల చేయాలని పై దేశాలు చిత్ర నిర్మాతలను కోరాయి. అయితే దుల్కర్ సల్మాన్‌కు గల్ఫ్ దేశాలలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గల్ఫ్ కంట్రీస్ నిర్ణయంతో సీతా రామం మూవీకి షాక్ తగిలినట్టయింది.