Raj Kumar Kasireddy : కమెడియన్‌ని ముద్దులతో ముంచేస్తున్న స్టార్ హీరో..

Raj Kumar Kasireddy : మన సెలబ్రిటీలు వాళ్లకి ఎవరైనా నచ్చితే వారిపై ప్రేమ కురిపిస్తారని తెలిసిందే. తాజాగా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కమెడియన్ రాజ్ కుమార్ కసిరెడ్డిని ముద్దులతో ముంచేస్తున్న వీడియో వైరల్ గా మారింది. రాజ్ కుమార్ కసిరెడ్డి షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి రాజావారు రాణిగారు సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే కామెడీ అదరగొట్టాడు. ఆ తర్వాత అశోకవనంలో అర్జున కళ్యాణం, రంగబలి, బెదురులంక, […]

Published By: HashtagU Telugu Desk
Dulquer Salmaan Showing Love on Comedian Raj Kumar Kasireddy Video goes Viral

Kasireddy

Raj Kumar Kasireddy : మన సెలబ్రిటీలు వాళ్లకి ఎవరైనా నచ్చితే వారిపై ప్రేమ కురిపిస్తారని తెలిసిందే. తాజాగా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కమెడియన్ రాజ్ కుమార్ కసిరెడ్డిని ముద్దులతో ముంచేస్తున్న వీడియో వైరల్ గా మారింది. రాజ్ కుమార్ కసిరెడ్డి షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి రాజావారు రాణిగారు సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే కామెడీ అదరగొట్టాడు.

ఆ తర్వాత అశోకవనంలో అర్జున కళ్యాణం, రంగబలి, బెదురులంక, ఇటీవల ఆయ్.. ఇలా అనేక సినిమాలతో ప్రేక్షకులని ఫుల్ గా నవ్వించి బాగా పాపులర్ అయిపోయాడు. ఇప్పుడిప్పుడే స్టార్ కమెడియన్ అవ్వడానికి ఎదుగుతున్నాడు. చేతి నిండా ఫుల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు రాజ్ కుమార్. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాలో కూడా రాజ్ కుమార్ నటిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం దుల్కర్ పుట్టిన రోజు కావడంతో లక్కీ భాస్కర్ షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్య జరిగిన ఫన్నీ సంఘటనలను వీడియో రూపంలో షేర్ చేస్తూ దుల్కర్ కి బర్త్ డే విషెస్ చెప్పాడు రాజ్ కుమార్.

ఈ వీడియోలో దుల్కర్.. రాజ్ కుమార్ ని తెగ ముద్దులు పెట్టేసుకుంటున్నాడు. గట్టిగా కౌగలించుకున్నాడు. రాజ్ కుమార్ వర్క్ దుల్కర్ కి బాగా నచ్చేసినట్టు ఉంది. దీంతో ఈ వీడియో చూసి నెటిజన్లు రాజ్ కుమార్ కసిరెడ్డి చాలా అదృష్టవంతుడు, స్టార్ హీరో అలా క్లోజ్ గా ఉన్నాడు అంటే మాటలా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజ్ కుమార్ తనపై అంత ప్రేమ కురిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ మీతో వర్క్ చేయాలి అని పోస్ట్ చేసాడు. ఇటీవల ఆయ్ సినిమాలో రాజ్ కుమార్ పర్ఫార్మెన్స్ కి ఎన్టీఆర్, బన్నీ కూడా అభినందించారు. మొత్తానికి రాజ్ కుమార్ కసిరెడ్డి వరుస సినిమాలతో దూసుకుపోతూ స్టార్ హీరోల మన్ననలు అందుకుంటున్నాడు.

 

Also Read : Devara Pre Release Event : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆ ముగ్గురు స్టార్ డైరెక్టర్స్..

  Last Updated: 20 Sep 2024, 07:06 AM IST