Site icon HashtagU Telugu

Lucky Baskhar: ఓటీటీలో దుమ్ము దులుపుతున్న దుల్కర్ సల్మాన్ సినిమా.. ఏకంగా 13 వారాల నుంచి ట్రెండింగ్‌!

Lucky Baskhar

Lucky Baskhar

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ సినిమా ఇటీవల విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పాటు అమరన్, క సినిమాలు విడుదల అయ్యాయి. వీటిలో అమరన్ అలాగే లక్కీ భాస్కర్ మూవీలు సూపర్ హిట్ గా నిలిచారు. ఇది ఇలా ఉంటే లక్కీ భాస్కర్ సినిమా విషయానికి వస్తే ఇప్పటికీ ఈ సినిమాలోనే చాలా సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా దిల్కర్ సల్మాన్ హీరోయిన్తో కలిసి ఒక గోల్డ్ షాప్ కి వెళ్లడం అక్కడ ఉన్న నగలు అన్ని కొనడం ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అక్టోబర్ 31 న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా నవంబర్ 28 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారం అవుతూ దూసుకుపోతోంది. అయితే దాదాపు 3 నెలలుగా ఈ సినిమా ఓటీటీలో ట్రెండింగ్ అవుతూ దూసుకుపోతోంది. ఓటీటీలో టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది.

 

ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. 13 వారాలుగా నెట్‌ఫ్లిక్స్‌ లో టాప్‌ లో ట్రెండ్‌ అవుతున్న తొలి దక్షిణాది సినిమా అంటూ సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పోస్టర్‌ ని రిలీజ్‌ చేసింది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇకపోతే లక్కీ భాస్కర్‌ సినిమా విషయానికి వస్తే.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్‌ లుగా నటించారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించగా నిమిషా రవి సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.