Site icon HashtagU Telugu

Lucky Baskhar : అదరగొడుతున్న లక్కీ భాస్కర్.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..

Dulquer Salmaan Lucky Baskhar Movie Two Days Collections

Lucky Baskhar

Lucky Baskhar : దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా లక్కీ భాస్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్ దర్శకత్వంలో నాగవంశీ నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న రిలీజయింది. బ్యాంకింగ్ నేపథ్యంలో ఓ కామన్ మ్యాన్ బ్యాంకుల్లో ఉన్న లొసుగులను వాడుకొని డబ్బు ఎలా సంపాదించాడు, వాటిని సక్రమంగా ఎలా మార్చుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కించారు.

లక్కీ భాస్కర్ రిలీజ్ కి ముందు పెయిడ్ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీపావళి సెలవులు కూడా ఉండటంతో కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. లక్కీ భాస్కర్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 12 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేయగా తాజాగా నేడు రెండు రోజుల కలెక్షన్స్ అనౌన్స్ చేసారు. లక్కీ భాస్కర్ సినిమా రెండు రోజుల్లో 26.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

ఇక ఈ సినిమా వీకెండ్ కి 50 కోట్లు, ఫుల్ రన్ లో 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ సినిమాతో దుల్కర్ తెలుగులో హ్యాట్రిక్ హిట్ కొట్టేసాడు.

 

Also Read : Trivikram : 2029 ఎన్నికల ముందు భారీ పొలిటికల్ సినిమా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో.. హీరో ఎవరు..?