Site icon HashtagU Telugu

Ranya Rao: రన్యారావు వద్ద కోట్లలో డబ్బులు.. షాక్ లో అధికారులు!

Ranya Rao

Ranya Rao

ఇటీవల బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యారావు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ విషయం రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో అలాగే సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆశ్చర్యపరిచే విషయాలు, షాకింగ్ అనిపించే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే నటి రన్యరావు దుబాయ్‌ నుంచి బంగారు బిస్కెట్లను అక్రమంగా తీసుకువస్తూ బెంగళూరులో దొరికిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆమెను మూడు రోజుల పాటు విచారించాలని డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ కు కోర్టు అనుమతి ఇచ్చింది.

ఇలా అక్రమంగా తరలించినందుకుగాను కిలో బంగారం రవాణాకు రన్యారావు కు రూ.5 లక్షల కమీషన్‌ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆమె నుంచి ఇప్పటికే 14 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు రూ.3 కోట్ల నగదును డీఆర్‌ఐ అధికారులు జప్తు చేశారు. ఆమె వద్ద మొత్తం రూ. 18 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. సినిమా అవకాశాలు లేని ఒక నటి వద్ద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండటం చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. తన వద్ద ఉన్న డబ్బుకు సరైన ఆధారాలను ఆమె చూపించలేకపోయింది.

అయితే ఆమె గత ఆరు నెలల్లో 27 సార్లు దుబాయ్‌ కు వెళ్లి వచ్చినట్లు అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమ ఆసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. కేవలం బంగారం అక్రమ రవాణా మాత్రమే కాకుండా సంఘ విద్రోహ శక్తులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. ఈ క్రమంలో రన్యారావు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ క్రమంలోనే దానిని కోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో ఇక కొత్త కొత్త విషయాలు వెలుగలోకి వస్తూనే ఉన్నాయి.