Site icon HashtagU Telugu

Double Ismart : డబుల్ ఇస్మార్ట్.. పూరీ వాళ్లను ఎందుకు సైడ్ చేశాడు..?

Double Ismart Streaming Amazon Prime

Double Ismart Streaming Amazon Prime

Double Ismart పూరీ జగన్నాథ్ రామ్ కాంబోలో ఇస్మార్ట్ శంకర్ తర్వాత వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రామ్ తో మరోసారి భారీ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు పూరీ. రీసెంట్ గా రామ్ బర్త్ డే సందర్భంగా డబుల్ ఇస్మార్ట్ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ అంతా సినిమాపై అంచనాలు పెంచుకున్నారు.

టీజర్ లో సర్ ప్రైజింగ్ గా డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్ కనిపించింది. ఇస్మార్ట్ శంకర్ కాంబో రిపీట్ చేస్తూ అందులో నటించిన హీరోయిన్స్ నభా నటేష్, నిధి అగర్వాల్ నే తీసుకుంటారని ఆడియన్స్ అనుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే నభా, నిధి ఇద్దరికి సూపర్ క్రేజ్ వచ్చింది. సినిమాలో ఇద్దరు చేసిన గ్లామర్ షో ఆడియన్స్ ని ఖుషి చేసింది.

ఐతే డబుల్ ఇస్మార్ట్ లో కూడా వారిద్దరినే తీసుకుంటారని వార్తలు రాగా లేటెస్ట్ టీజర్ లో కావ్య థాపర్ సర్ ప్రైజ్ చేసింది. నభా, నిధి ఇద్దరు అంతగా ఫాం లో లేరు కాబట్టి వాళ్ల బదులుగా కావ్యని తీసుకున్నారు. ఐతే కావ్య థాపర్ ని కూడా సినిమాలో ఒక రేంజ్ లో వాడుకుని ఉంటారని అంటున్నారు. తెలుగులో ఒక మంచి బ్రేక్ కోసం చూస్తున్న కావ్య సంతోష్ శోభన్ తో ఏక్ మిని కథలో నటించింది.

ఈ ఇయర్ రవితేజ చేసిన ఈగల్, సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన సినిమాల్లో నటించిన కావ్య డబుల్ ఇస్మార్ట్ తో మరో క్రేజీ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో పూరీ అమ్మడి గ్లామర్ సైడ్ కూడా చూపించబోతున్నాడని టాక్. సినిమా సక్సెస్ అయితే కావ్యాకి లక్ తగిలినట్టే అని చెప్పొచ్చు.

Also Read : NTR : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్..!