రామ్ – పూరి కలయికలో 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) తెరకెక్కింది. రామ్ (Ram) సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటించాడు. పూరి (Puri) కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మితో కలిసి పూరి జగన్నాధ్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు..అప్పటి వరకు వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రామ్ – పూరిలకు ఈ మూవీ ఉపిరిపోసినట్లు అయ్యింది. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ కి ..సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తుందని ప్రకటించడం తోనే సినిమా ఫై ఆసక్తి మొదలైంది. సినిమా తాలూకా టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ఇలా ప్రతిదీ ఆసక్తి పెంచడం తో సినిమాను చూసేందుకు సినీ లవర్స్ , అభిమానులు పోటీ పడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇండియా లో ఈరోజు ఉదయం నుండి షోస్ మొదలవ్వగా..బయట దేశాల్లో అర్ధరాత్రి నుండే షోస్ స్టార్ట్ కావడం తో సినిమా చూసిన ఫ్యాన్స్ ..సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన ప్రతి చోట సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. హీరో రామ్ క్యారెక్టరైజేషన్, పూరి మార్క్ డైరెక్షన్ ఆకట్టుకుంటాయని, ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ సినిమాకు ప్లస్‌గా మారిందని చెపుతున్నారు.
రామ్ ఎనర్జీ, డ్యాన్స్‌లు, ఎంటర్టైనింగ్ డైలాగులు, సినిమాటోగ్రఫీ, స్టెప్పా మార్, మార్ ముంత పాటలు ఇవన్నీ సినిమాకు ప్లస్ గా మారితే.. బీజీఎమ్ (BGM) మాత్రం పెద్దగా ఆకట్టుకోదలని , అలీ కామెడీ సైతం నిరాశకు గురి చేసిందని. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్ట్, స్క్రీన్ ప్లే కూడా కాస్త నిరాశ పర్చాయని ఫ్యాన్స్ అంటున్నారు. చిన్న చిన్న అంశాలు మినహా, ఓవరాల్‌గా సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందని చెపుతున్నారు. మరి పూరి ఖాతాలో హిట్ పడ్డట్లేనా..లేదా అనేది పూర్తి రివ్యూస్ పడితే కానీ తెలియదు.
Read Also : Mr Bachchan Public Talk – హరీష్ కనిపిస్తే కొడతాం