Double Ismart : డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ చివర్లో ఈ ట్విస్టులు ఏంటి పూరీ..?

Double Ismart పూరీ జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కాగా ఆ సినిమా వచ్చిన నాలుగేళ్ల తర్వాత లాస్ట్ ఇయర్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్

Published By: HashtagU Telugu Desk
Ram Double Ismart premiers Planing on this date

Ram Double Ismart premiers Planing on this date

Double Ismart పూరీ జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కాగా ఆ సినిమా వచ్చిన నాలుగేళ్ల తర్వాత లాస్ట్ ఇయర్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మొదలైంది. రాం ఎనర్జీని పర్ఫెక్ట్ గా వాడుకున్న డైరెక్టర్స్ లో పూరీ ఒకరు. అందుకే ఇస్మార్ట్ శంకర్ కెరీర్ హిట్ అందించాడు. ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా ఆ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. ఐతే డబుల్ ఇస్మార్ట్ విషయంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది.

సినిమా కోసం పూరీ లావిషింగ్ గా ఖర్చు పెడుతున్నారట. డబుల్ ఇస్మార్ట్ లో ఈమధ్యనే భారీ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేశారని తెలుస్తుంది. డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి లేటెస్ట్ గా సినిమాటోగ్రాఫర్ జియన్ని జియన్నెల్లి బయటకు వచ్చేశాడని టాక్. సినిమా దాదాపు చివరి దశకు చేరుకుందని వార్తలు రాగా ఈ టైం లో కెమెరా మెన్ ఎగ్జిట్ అవ్వడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.

అతని ప్లేస్ లో శ్యామ్ కె నాయుడిని పూరీ తీసుకున్నాడట. పూరీతో అతనికి మంచి ర్యాపో ఉంది. ఆల్రెడీ ఇద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. డబుల్ ఇస్మార్ట్ సినిమాకు అతను అయితే న్యాయం చేస్తాడని శ్యామ్ కె నాయుడిని తీసుకున్నారట. మరి పూరీ ఈ సడెన్ చేంజ్ కి కారణం ఏంటన్నది తెలియదు కానీ దీని వల్ల సినిమా అవుట్ పుట్ మీద తేడా రాకుండా చూసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు.

  Last Updated: 14 Feb 2024, 05:03 PM IST