Site icon HashtagU Telugu

Kavya Thapar : కావ్య థాపర్ ని ఫుల్లుగా వాడినట్టు ఉన్నారుగా..!

Double Ismart Kavya Thapar Next Level Show

Double Ismart Kavya Thapar Next Level Show

Kavya Thapar పూరీ రామ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా డబుల్ ఇస్మార్ట్. ఆగష్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆదివారం జరిగిన ట్రైలర్ రిలెజ్ ఈవెంట్ లో రామ్ ఫ్యాన్స్ తో పాటు పూరీ ఫ్యాన్స్ హంగామా ఒక రేంజ్ లో ఉంది. లైగర్ తర్వాత పూరీ చేస్తున్న ఈ సినిమాపై మాస్ ఆడియన్స్ లో అంచనాలు బాగున్నాయి. రామ్ (Ram) డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో అమ్మడిని కూడా పర్ఫెక్ట్ గా వాడుకున్నట్టు అనిపిస్తుంది.

పూరీ సినిమాల్లో హీరోయిన్స్ గ్లామర్ షో ఒక రేంజ్ లో ఉంటుంది. పూరీ చేతుల్లో పడ్డ హీరోయిన్ ఫేట్ మారినట్టే అని చెప్పుకుంటారు. డబుల్ ఇస్మార్ట్ లాంటి మాస్ సినిమాలో కావ్య థాపర్ లాంటి గ్లామర్ బ్యూటీ హీరోయిన్ గా నటించింది. అందుకే సినిమాలో ఆమెను అన్ని విధాలుగా ఆడియన్స్ ని మెప్పించేలా గ్లామర్ ట్రీట్ ఇప్పించారని తెలుస్తుంది. డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) ట్రైలర్ చూస్తేనే హీరోయిన్ ని ఒక రేంజ్ షో ఉంటుందని అర్ధమవుతుంది.

Also Read : NTR : అతని కంపోజింగ్ లో తారక్.. థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే..!

అంతకుముందు చిన్న సినిమాల్లో చేస్తూ వచ్చిన కావ్య సందీప్ కిషన్ తో బెదురులంక రవితేజ ఈగల్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ లో మెయిన్ లీడ్ గా చేసింది. రామ్ తో అమ్మడు లిప్ లాక్ కూడా కానిచ్చేసిందని అర్ధమవుతుంది. డబుల్ ఇస్మార్ట్ లో కావ్య అందాలు కూడా హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

డబుల్ ఇస్మార్ట్ హిట్ అయ్యింది అంటే మాత్రం కావ్య థాపర్ కెరీర్ పీక్స్ కి వెళ్లినట్టే అని చెప్పొచ్చు. పూరీ రామ్ కలిసి మరో సూపర్ హిట్ కొట్టేలా డబుల్ ఇస్మార్ట్ తో వస్తున్నారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో మరో 10 రోజుల్లో తెలుస్తుంది.