Site icon HashtagU Telugu

Double Ismart : ఫైట్ కోసం ఏడున్నర కోట్లు.. డబుల్ ఇస్మార్ట్ పూరీ కెరీర్ లోనే హయ్యెస్ట్..!

Ram Parasuram movie is on Cards

Ram Parasuram movie is on Cards

రామ్ (Ram) పూరీ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి భారీ యాక్షన్ సీన్ న్యూస్ ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. ఈ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్ లో ప్లాన్ చేశారట. ఈ ఫైట్ సీన్ కోసం భారీ మొత్తం లో ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ముంబైలో జరిగిన ఈ యాక్షన్ సీన్ కోసం భారీ సెట్ వేశారట. దీనికోసం దాదాపు ఏడున్నర కోట్ల దాకా ఖర్చు అయినట్టు తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

పూరీ సినిమాల్లో ఇంత భారీ బడ్జెట్ సెట్ ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. అయితే సినిమా కంటెంట్ కి ఇది అవసరం కాబట్టే అంత బడ్జెట్ పెట్టి మరీ ఈ సెట్ వేశారట. ఇక ఈ సినిమా కోసం రామ్ తన ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నాడని తెలుస్తుంది. రామ్ పూరీ ఇద్దరు కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇద్దరి కాంబినేషన్ పై క్రేజ్ పెరిగింది.

ఇక డబుల్ ఇస్మార్ట్ తో ఈ కాంబో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ (Sanjay Datt) విలన్ గా నటిస్తున్నారు. సినిమా పూరీ మార్క్ మాస్ మూవీగా తెరకెక్కుతుందని తెలుస్తుంది. స్కంద తర్వాత రామ్ చేస్తున్న ఈ సినిమా టార్గెట్ మిస్ అవ్వకూడదని గట్టిగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది.

ఈ సినిమా కోసం రామ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. సినిమా మార్చి 8న రిలీజ్ అనుకున్నా కొన్ని కారణాల వల్ల వాయిదా వేసే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది.

Also Read : Viswak Sen Gangs of Godhavari Special Song : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్పెషల్ సాంగ్ లో తెలుగు హీరోయిన్.. విశ్వక్ సేన్ తో ఆటా పాట..!