Site icon HashtagU Telugu

Double Ismart : ‘డబుల్ ఇస్మార్ట్’ మరో సింగిల్ వచ్చేస్తుంది

Double Ismart 2nd Single Re

Double Ismart 2nd Single Re

రామ్ – పూరి కలయికలో 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామ్ సరసన కావ్య థాప‌ర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ విల‌న్ గా న‌టిస్తున్నాడు. పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ పై ఛార్మితో క‌లిసి పూరి జ‌గ‌న్నాధ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మూవీ ఫై అంచనాలు తారాస్థాయిలో ఉండడం..పూరి ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్యనే ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకునే మేకర్స్..ఇప్పుడు రెండో సింగిల్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ‘మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంత చోడ్ చింత’ (Maar Muntha Chod ) అంటూ సాగే ఈ పాటను జులై 16న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రామ్ లుక్ ఆకట్టుకుంది. ఈ పోస్టర్ లో ఇందులో రామ్ రెండు చేతుల్లో రెండు బాటిల్స్ పట్టుకొని మందు తాగుతూ కనిపించాడు. ఈ మూవీ తో రామ్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మరి పూరి ఏంచేస్థాడో చూడాలి.

Read Also : Spiritual: పురుషులు మొలతాడు ఎందుకు ధరించాలి.. ఎప్పుడు ధరించాలో మీకు తెలుసా?