Site icon HashtagU Telugu

Piracy : పైరసీకి మద్దతు ఇవ్వకండి..ఆపదలో చిక్కుకోకండి..

Piracy Racket

Piracy Racket

పైరసీ భూతం అనేది ఇప్పుడు విచ్చలవిడి అయ్యింది. ఒకప్పుడు సినిమాలు మాత్రమే పైరసీ చేసేవారు. కానీ ఇప్పుడు సినిమాలే కాదు అన్నింటికీ పైరసీ చేస్తున్నారు. భారతీయులే కాదు ప్రవాస భారతీయులు సైతం పైరసీ కి మద్దతు తెలుపుతుండడంతో రోజు రోజుకు పైరసీ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా యుఎస్, కెనడాలో నివసిస్తున్న ఎందరో ప్రవాస భారతీయ ప్రేక్షకులకు చట్టవిరుద్దంగా టీవీ మరియు ఓటీటీ కంటెంట్ చూడటం వల్ల YuppTV, Zee5, SonyLIV, Hotstar, Netflix, Amazon, SunNXT, Aha, Colors వంటి ప్లాట్‌ఫారమ్‌లకు విపరీతమైన నష్టం వాటిల్లుతుంది.

కొంతమంది IPTV యాప్‌లు మరియు IPTV సెటప్ బాక్స్‌ల ద్వారా అక్రమంగా ఈ పైరేట్స్ ద్వారా కంటెంట్ ప్రసారం చేస్తున్నారు. అయితే దీనిని చాలా మంది కస్టమర్‌లు గుర్తించడం లేదు. ఈ బాక్సులను పైరేట్‌ల నుండి కొనుగోలు చేయడం మరియు వన్-టైమ్ ఫీజు చెల్లించడం ద్వారా వారు ఈ నేరస్థులకు, పైరేట్‌లకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు అవుతుంది. ఈ పైరేట్‌లు కంటెంట్ యజమానుల నుండి కంటెంట్‌ను దొంగిలించి ప్రసారం చేస్తుండడం వల్ల మీడియా మరియు వినోద పరిశ్రమలో భారీ ఆర్థిక నష్టాలు జరగడమే కాదు.. ఎంతో మంది ఉద్యోగాల పై కూడా ఆ ప్రభావం పడుతుంది. అంతేకాకుండా, పైరేట్స్ అక్రమంగా డార్క్ వెబ్‌లో పనిచేస్తూ కస్టమర్ చెల్లించిన నిధులను చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించడం వలన వినియోగదారులకు మరియు ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది. కస్టమర్‌లు తెలియకుండానే డ్రగ్స్ అక్రమ రవాణా మరియు ఉగ్రవాదం వంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పరోక్షంగా సహకరిస్తున్నారు.

చట్టవిరుద్ధమైన IPTV బాక్స్‌ను కలిగి వాడటం వల్ల కలిగే పరిణామాలు చాలా ప్రమాదకరం. పైరేటెడ్ IPTV కంటెంట్ స్ట్రీమింగ్ కోసం కాన్ఫిగర్ చేయబడిన పరికరం బాక్స్ ప్యాకెట్‌లను పర్యవేక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అది కస్టమర్ వ్యక్తిగత మరియు రహస్య సమాచారాన్ని ట్రాక్ చేయడానికి పైరేట్‌లను అనుమతిస్తుంది. ఈ పైరేట్‌లు సేకరించిన క్రెడిట్ కార్డ్ వివరాలు డార్క్ వెబ్‌లోకి చేరతాయి. ఇటీవల ఈ పైరేట్‌లు స్వాధీనం చేసుకున్న వినియోగదారులు వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లోకి చేరుతోందని నగారా టెక్నాలజీస్ స్పష్టం చేసింది. ఫిషింగ్ ఇ-మెయిల్‌ల వలన వైర్ బదిలీల ద్వారా ఎందరో డబ్బును పోగొట్టుకున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇమెయిల్‌లు తెలిసిన వారి నుండి వచ్చిన కమ్యూనికేషన్‌ లాగా కనిపిస్తూ నిధులను బదిలీ చేస్తూ వినియోగదారులను మోసగిస్తున్నాయి.

పైరసీ ద్వారా వచ్చే నిధులు డ్రగ్స్, ఉగ్రవాదం మరియు మానవ అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ పనులకి వాడటం జరుగుతుంది. పైరేటెడ్ IPTV కంటెంట్ వినియోగం ద్వారా పైరేట్స్‌కు ఆర్థిక సహాయం అందిస్తూ కస్టమర్లు ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పరోక్షంగా సహకరిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతర్జాతీయ మార్కెట్లలో Chitram TV, BOSS IPTV, Tashan IPTV, Real TV, JadooTV, World Max TV, Maxx TV, VBox, Vois IPTV, Punjabi IPTV మరియు Indian IPTV వంటి అక్రమ పైరేట్స్‌ ఉన్నాయి. ఈ పైరేటెడ్ బాక్స్‌ల ద్వారా చట్టవిరుద్ధంగా బాక్స్‌ల ద్వారా వీక్షించే వినియోగదారులు న్యాయస్థానం నుండి చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. సబ్‌స్క్రైబర్లు ఈ పైరేట్ సేవల ద్వారా చట్టవిరుద్ధంగా వీక్షించిన ప్రతి కంటెంట్‌కు భారీ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు. ఇది వినియోగదారులకు వేల డాలర్లు చెల్లించే జరిమానాల ద్వారా ఆర్థిక కష్టాలకు దారి తీస్తుంది. యూకేలో ఇటీవల జరిగిన పైరసీ కేసులో ..పైరసీ కంటెంట్‌ను చట్టవిరుద్ధంగా చూస్తున్న కస్టమర్‌లు నేరానికి పాల్పడుతున్నారని తేలింది.

ఇండియా, యూఎస్,కెనడా మరియు ఇతర దేశాల అందరు బాధ్యతాయుతమైన పౌరులు, వినియోగదారులు పైరసీకి మద్దతు ఇవ్వకుండా, YuppTV, Zee5 మరియు SunNXT వంటి OTTల ద్వారా చట్టబద్ధంగా కంటెంట్‌ను యాక్సెస్ పొందాలని అభ్యర్ధన. పైరేటెడ్ కంటెంట్‌ చూడటం వల్ల సబ్స్క్రైబర్‌లు డార్క్ వెబ్ ద్వారా పైరేట్‌ల ద్వారా సైబర్‌ అటాక్‌లతో నష్టాలకు గురవుతారు. ఇటీవల యూకేలో జరిగిన సంఘటనలు మరియు మే 15న France లో చట్టాలు ఆమోదించడం వల్ల పైరేటెడ్ కంటెంట్‌ను చూసే కస్టమర్‌లు ఎన్నో చిక్కులు ఎదుర్కుంటున్నారు. సో దయచేసి పైరసీ ని ప్రోత్సహించకండి..చిక్కుల్లో పడకండి అని కోరుతున్నారు.

Read Also : Pawan Kalyan : నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కళ్యాణ్ – నారా లోకేష్