రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో స్పిరిట్ అనే సినిమా త్వరలో మొదలు కాబోతుంది. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఇప్పటికే తారాస్థాయి అంచనాలతో ఉన్నారు. ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఐతే స్పిరిట్ సినిమాలో విలన్ గా సౌత్ కొరియా యాక్టర్ డాన్ లీ (Donlee) నటిస్తాడని కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్త.
ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా డాన్ లీ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు అతని వీడియోస్ ని వైరల్ చేస్తున్నారు. ఐతే రీసెంట్ గా సందీప్ వంగా ఆర్జీవితో జరిగిన స్పెషల్ చిట్ చాట్ సినిమాటికా ఎక్స్ పోలో భాగంగా ఈ విషయాన్ని కూడా మరోసారి ప్రస్తావించారు.
సందీప్ వంగ ఏదో గట్టిగానే..
సందీప్ వంగ (Sandeep Vanga) స్పిరిట్ కు సంబందించిన విషయాలన్నీ కూడా త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. డాన్ లీ ఉన్నాడా లేదా అన్నది కూడా త్వరలో చెబుతామని అన్నారు. సో ఈ లెక్క సందీప్ వంగ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది. ప్రభాస్ తో డాన్ లీ నటిస్తే మాత్రం స్పిరిట్ సినిమాకు ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ వచ్చేస్తుందని చెప్పొచ్చు.
ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే అటు ఫౌజి, ఇటు స్పిరిట్ (Spirit) రెండు సినిమాలను ఒకేసారి షూటింగ్ చేయాలని చూస్తున్నాడు. ఆల్రెడీ ఫౌజి సినిమా షూటింగ్ మొదలు కాగా స్పిరిట్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
Also Read : Pushpa 2 : పుష్ప 2 కోసం థమన్ మాత్రమే కాదు.. ఆ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా..!