Site icon HashtagU Telugu

Bigg Boss : బిగ్ బాస్ హౌస్ లోకి గాడిదని తెచ్చిన కంటెస్టెంట్..!

Donkey Enter Into Bigg Boss House With A Contestent

Donkey Enter Into Bigg Boss House With A Contestent

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బిగ్ బాస్ (Bigg Boss ) హడావిడి కనిపిస్తుంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 రీలోడింగ్ అంటూ ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ తో షోకి హైప్ వచ్చేలా చేశారు. వైల్డ్ కార్డ్ గా కొత్త వాళ్లు కాకుండా ఇదివరకు సీజన్లలో పాల్గొన్న వారినే తీసుకు రవడం కూడా కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది. ఆదివారం బిగ్ బాస్ 8 తెలుగులో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరగగా.. మరోపక్క తమిళ్ లో బిగ్ బాస్ సీజన్ 8 నిన్న ఆదివారం మొదలైంది.

కమల్ తర్వాత విజయ్ సేతుపతి మొదటిసారి బిగ్ బాస్ తమిళ్ హోస్ట్ గా చేస్తున్నారు. ఇదే కాదు హిందీలో బిగ్ బాస్ సీజన్ 18 కూడా ఆదివారం మొదలైంది. సల్మాన్ ఖాన్ (Salman Khan) హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 18 లో ఒక విచిత్రం జరిగింది. ఇన్ని సీజన్లలో బిగ్ బాస్ హౌస్ లో కేవలం కంటెస్టెంట్స్ గా మనుషులు మాత్రమే వెళ్లారు. మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఒక గాడిద వెళ్లింది.

కంటెస్టెంట్స్ అంతా షాక్..

బిగ్ బాస్ సీజన్ 18 హిందీలో అడ్వకేట్ గుణరత్న సదావర్తే వచ్చారు. ఆయనతో పాటు ఆయన పెంచుకుంటున్న గాడిద(Donkey) ని కూడా హౌస్ లోకి తీసుకొచ్చారు. ఇది చూసి కంటెస్టెంట్స్ అంతా షాక్ అయ్యారు. తనని విడిచి ఆ గాడిద ఉండలేదని అందుకే హౌస్ లోకి తెచ్చానని ఆయన అన్నారు.

ఐతే బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది గాడిద అంటే కష్టమే అని చెప్పాలి. అసలు బిగ్ బాస్ టీం గాడిదని ఎలా హౌస్ లోకి తీసుకెళ్లే పర్మిషన్ ఇచ్చారో తెలియాల్సి ఉంది. ఐతే అతను లాయర్ కాబట్టి అతనితో వాధించడం కుదరక అలా చేసి ఉండొచ్చని అన్నారు. ఐతే కంటెస్టెంట్స్ నుంచి కంప్లైంట్స్ వస్తే మాత్రం గాడిదని బయటకు పంపించే ఛాన్స్ ఉంటుంది.