Don Lee : ‘సలార్-2’లో కొరియన్ నటుడు నిజమేనా..?

Don Lee : డాన్ లీ 'సలార్-2' పోస్టర్ను ఇన్స్టాలో స్టోరీగా పెట్టుకోవడంతో ఈ మూవీలో నటించనున్నారనే చర్చ మొదలైంది

Published By: HashtagU Telugu Desk
Donelee Salaar2

Donelee Salaar2

ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కనున్న ‘సలార్-2’ (Salaar 2)లో కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ (Don Lee) నటించబోతున్నాడనే వార్త సినిమాపై మరింత హైప్ తెస్తుంది. తాజాగా డాన్ లీ ‘సలార్-2’ పోస్టర్ను ఇన్స్టాలో స్టోరీగా పెట్టుకోవడంతో ఈ మూవీలో నటించనున్నారనే చర్చ మొదలైంది. మరి నిజంగా ఆయన నటిస్తున్నారా..లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సిరీస్ తెరకెక్కుతుంది. ఇప్పటికే మొదటి పార్ట్ విడుదలై బ్లాక్ బస్టర్ కాగా..ఇప్పుడు రెండో పార్ట్ పై అంచనాలు నెలకొన్నాయి.

ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే..

డైరెక్టర్ మారుతీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘ది రాజాసాబ్’ (The Raja Saab) మూవీ లో నటిస్తున్నాడు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు 50శాతం పూర్తి చేసుకుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సైనికుడుగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే వర్కింగ్‌ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇక సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న ‘స్పిరిట్‌’ కూడా జనవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. ఇలా వరుస సినిమాలు లైన్లో పెట్టాడు ప్రభాస్.

Read Also : Sajjala Bhargav Reddy : సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు..ఇక చుక్కలే

  Last Updated: 10 Nov 2024, 12:01 PM IST