Site icon HashtagU Telugu

Sandhya Theater Incident : బన్నీ చేసిన పనికి ఇండస్ట్రీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనా..?

Allu Arjun

Allu Arjun

అంటే ఖచ్చితంగా అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). పుష్ప 2 (Pushpa 2) సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందడం..ఆమె కుమారుడు ప్రస్తుతం మృతువుతో పోరాడుతుండడంఫై రాష్ట్ర సర్కార్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. అల్లు అర్జున్ రావడం వల్లే ఓ మహిళ మృతి చెందిందని సాక్ష్యాత్తు అసెంబ్లీ లో సీఎం ప్రస్తావించారు. చట్టం ఎవర్ని వదిలిపెట్టదని హెచ్చరిక కూడా జారీ చేసారు. అక్కడి తో ఆగకుండా ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు..టిక్కెట్ల ధరల పెంపు ఉండదని కుండబద్దలు కొట్టాడు. ఇప్పుడు ఈ ప్రకటన చిత్రసీమను షాక్ కు గురి చేస్తుంది. నిన్నటి వరకు సమస్య సర్దుమణుగుతుందిలే అని అంత అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సీఎంనే స్వయంగా బెనిఫిట్ షోలు ఉండవు..టిక్కెట్ల ధరల పెంపు ఉండదని చెప్పడం తో అల్లు అర్జున్ చేసిన పనిపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శనివారం అసెంబ్లీ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద తక్కిసలాట జరగడం, ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఇప్పటికీ కోమలోనే మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తుతో చోటు చేసుకోకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. “నేను సినీ ప్రముఖులకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి. డబ్బులు సంపాదించుకోండి ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోండి షూటింగ్లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి. ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. నేను కుర్చీలో ఉన్నంత వరకూ ఇలాంటి ఘటనలను ఉపేక్షించను. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవు. తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడటమే నా బాధ్యత, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎవరినీ ప్రభుత్వం వదిలి పెట్టదు” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఈ ప్రకటన తో సంక్రాంతికి రాబోయే చిత్రాల నిర్మాతలకు గుబులు స్టార్ట్ అయ్యింది. సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ప్రధానమైంది రామ్ చరణ్ – శంకర్ ల ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీ ని దాదాపు మూడేళ్లుగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అన్ని పనులు పూర్తి చేసుకొని , ప్రమోషన్లను మొదలుపెట్టింది. సంక్రాంతి సందర్బంగా భారీ ఎత్తున రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. ఇక సినిమా టికెట్స్ ధరలు సైతం భారీగా పెంచాలని అనుకున్నారు కానీ ఇప్పుడు రేవంత్ ఇచ్చిన షాక్ కు ఏంచేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయారు. ఒక్క గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు సంక్రాంతి బరిలో సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ డాకు మహారాజ్ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఇక సమ్మర్ లో కూడా భారీ సినిమాలు బరిలో ఉన్నాయి. మరి ఇప్పుడు సీఎం రేవంత్ బెనిఫిట్ షోస్ కు అనుమతి లేదని చెప్పడం , అలాగే టికెట్ ధరలు కూడా పెంచుకునే ఛాన్స్ ఇవ్వనని చెప్పడంతో భారీ బడ్జెట్ సినిమాల పరిస్థితి ఏంటి..? నిర్మాతల ఎలా కోలుకుంటారు..? దీనిపై సినీ ప్రముఖులు సీఎం రేవంత్ ను కలుస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. మొత్తం మీద అల్లు అర్జున్ చేసిన ఒక్క పనివల్ల ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఇబ్బందుల్లో పడింది.

Read Also : Telangana assembly : తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా