Site icon HashtagU Telugu

Dunki Teaser: షారుక్ ఖాన్ డుంకీ టీజర్ రిలీజ్, ఫన్ అండ్ ఎమోషన్ డ్రామా

Dunki

Dunki

Dunki Teaser: రాజ్‌కుమార్ హిరానీ, షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో డుంకీ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేసినప్పటి నుండి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం మొదటి టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఈరోజు షారుఖ్ ఖాన్ 58వ పుట్టినరోజున నవంబర్ 2 డుంకీ డ్రాప్ 1 పేరుతో డుంకీ ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయబడింది. షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం లోతైన భావోద్వేగాలను రేకెత్తిస్తుంది.

DUNKI DROP 1 విదేశీ వెళ్లాలనే బలమైన కోరిక ఉన్న నలుగురు స్నేహితులను పరిచయం చేస్తుంది. నిజ జీవిత అనుభవాల ఆధారంగా, డుంకీ హాస్యభరితమైన, ఉద్వేగభరితమైన ద్రుశ్యాలు చూడొచ్చు. ఈ ప్రత్యేకమైన కథలో షారూఖ్ ఖాన్‌తో కలిసి బోమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్ మరియు అనిల్ గ్రోవర్ ఉన్నారు. డైరెక్టర్ హిరానీ మున్నా భాయ్ MBBSలో షారుఖ్ ఖాన్‌ను నటింపజేయాలని అనుకున్నాడు, అయితే అది కార్యరూపం దాల్చలేదు. డుంకీ రూపంలో మళ్లీ కాంబినేషన్ సెట్ అయ్యింది.