తెలుగు సినీ ప్రేక్షకులకు నటి,యాంకర్ అనితా చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనితా చౌదరి ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు యాంకరింగ్, మరోవైపు సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. వెండితెరపై చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఒక ప్రముఖ చానెల్ లో ప్రసారమైన కస్తూరి సీరియల్ అనితకు మంచి పేరొచ్చింది. అలాగే రుతు రాగాలు, నాన్న సీరియల్స్ తోనూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది అనితా.
ఇక వెండితెరపై కూడా సుమారు 50 కు పైగా సినిమాల్లో నటించింది. హీరో, హీరోయిన్ లకు తల్లి క్యారెక్టర్ లలో అత్త క్యారెక్టర్లలో నటించి మెప్పించింది. 1999లో ముప్పలనేని శివ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన రాజా సినిమాలో టీవీ యాంకర్ పాత్రలో తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది అనితా. దీని తర్వాత దాదాపు 50 సినిమాల్లో నటించి ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ముఖ్యంగా తెలుగులో మురారి, సంతోషం, ఆనందం, నువ్వే నువ్వే, గోల్ మాల్, ఛత్రపతి, ఉయ్యాల జంపాల, మన్మథుడు, నిన్నే ఇష్టపడ్డాను, కేరింత వంటి సినిమాలలో నటించింది.
అయితే అనితా గురించి మనందరికీ తెలిసిందే కానీ అనితా వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఈమె టాలీవుడ్ స్టార్ హీరోకి చెల్లెలు అన్న విషయం అస్సలు తెలియదు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు హీరో శ్రీకాంత్ కు చెల్లెలు వరుస అవుతుందట. అనిత, కృష్ణ చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కృష్ణ చైతన్య శ్రీకాంత్ కు చాలా దగ్గర బంధువు అవుతాడు. అంతేకాకుండా వీళ్ల పెళ్లి కూడా శ్రీకాంతే దగ్గరుండి జరిపించాడట. ప్రస్తుతం అనిత, కృష్ణ చైతన్య దంపతులకు ఒక బాబు ఉన్నాడు.