ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్స్(Heroine) వస్తుంటారు వెళ్తుంటారు. అలా 2009లో టాలీవుడ్(Tollywood)కి ఎంట్రీ ఇచ్చిన హీరోయినే ఈ చిన్నారి. ఈమె ఒక స్టార్ హీరోయిన్ కూతురు కూడా. ఇంకో విషయం ఏంటంటే.. టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన సినిమాతోనే ఈ భామ కూడా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అంతేకాదు మొదటి సినిమాతోనే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని అందుకుంది. ఇక రెండో సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకుంది. నాలుగో సినిమాకి జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? తను ఎవరో కాదు.. అక్కినేని నాగచైతన్యతో(Naga Chaitanya) కలిసి జోష్(Josh) సినిమాతో ఆడియన్స్ కి పరిచయమైన కార్తీక నాయర్ (Karthika Nair). సీనియర్ నటి రాధ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. తమిళంలో జీవా హీరోగా తెరకెక్కిన ‘రంగం’ సినిమాతో మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ఇక ఎన్టీఆర్ తో కలిసి ‘దమ్ము’ సినిమాలో కనిపించింది. అయితే ఈ భామ.. తన సినిమా కెరీర్ ని చాలా తొందరగానే ముగించేసింది. 2015 తరువాత నుంచి కార్తీక మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. 2017లో ఒక హిందీ పీరియాడికల్ టెలివిజన్ స్టోరీలో కనిపించింది.
ఆ తరువాత దుబాయ్ వెళ్ళిపోయి అక్కడ బిజినెస్ ఉమెన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఉదయ్ సముద్ర గ్రూప్స్ అనే సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేస్తూ.. ఆ కంపెనీ వ్యాపార కార్యకలాపాలను డెవలప్ చేయడంలో కార్తీక విశేషమైన పాత్ర పోషిస్తూ వచ్చింది. దీంతో దుబాయ్ లోనే స్థిరపడి పోయిన కార్తీకకు ఇటీవలే దుబాయ్ ప్రభుత్వం ఆమెను యంగ్ ఎంట్రప్రెన్యూవర్‌గా గుర్తించి.. కార్తీకకు గోల్డెన్ వీసా అందజేశారు. ప్రస్తుతం కార్తీక అక్కడ మహిళా పారిశ్రామికవేత్తగా గొప్ప పొజిషన్ లో ఉంది.