Rajinikanth : రజినీకాంత్‌తో ఈ ఫొటోలో ఉన్న బాబు ఎవరో గుర్తు పట్టారా..? ఇప్పుడు స్టార్ హీరో..

రజినీకాంత్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా మూవీ 'భగవాన్ దాదా'. ఈ సినిమాలో ఇప్పటి స్టార్ హీరో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఫొటోలో కనిపిస్తున్న పిల్లోడు ఆ హీరోనే. అతడు ఎవరో గుర్తు పట్టారా..?

Published By: HashtagU Telugu Desk
Do you Know who is the Child Artist in Rajinikanth Bollywood Movie Bhagawan Dada

Do you Know who is the Child Artist in Rajinikanth Bollywood Movie Bhagawan Dada

సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth).. తమిళంతో పాటు హిందీ, తెలుగు భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్(Bollywood) లో కొన్ని సినిమాల్లో గెస్ట్ అపిరెన్స్ ఇచ్చి అదరగొట్టిన రజిని.. కొన్ని సినిమాల్లో హీరోగా నటించి హిందీ ఆడియన్స్ ని కూడా తన అభిమానులను చేసుకున్నాడు. రజినీకాంత్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా మూవీ ‘భగవాన్ దాదా'(Bhagavan Dada). ఈ సినిమాలో ఇప్పటి స్టార్ హీరో చైల్డ్ ఆర్టిస్ట్(Child Artist) గా నటించాడు. పైన ఫొటోలో కనిపిస్తున్న పిల్లోడు ఆ హీరోనే.

ఆ హీరో మరి ఎవరో కాదు.. బాలీవుడ్ సూపర్ హీరో ‘హృతిక్ రోషన్'(Hrithik Roshan). భగవాన్ దాదా సినిమాలో హృతిక్ పాత్ర చాలా ముఖ్యమైనది. రజినీకాంత్ కి హృతిక్ పరిచయంతోనే సినిమా కథ మలుపు తిరుగుతుంది. ఓం ప్రకాశ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. 1986 లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. యూట్యూబ్ లో ఈ సినిమా హిందీ లాంగ్వేజ్ లో అందుబాటులో ఉంది. గతంలో హృతిక్ ఈ సినిమా గురించి, సినిమాలో రజినీకాంత్ తో వర్క్ అప్పీరెన్స్ గురించి కూడా ట్వీట్ చేసాడు.

 

ఈ సినిమా కంటే ముందు హృతిక్ రోషన్ పలు సినిమాల్లో కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించాడు. మొదటిసారి, చివరిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా హృతిక్ నటించిన సినిమా అంటే ఇదే. ఈ మూవీ తరువాత తన తండ్రి రాకేశ్ రోషన్ డైరెక్ట్ చేసిన పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తరువాత 2000 సంవత్సరంలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కహో నా ప్యార్ హాయ్’ సినిమాతో నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశాడు.

ఇక తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన కోయి మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 సినిమాలతో ఇండియన్ సూపర్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆడియన్స్ అంతా క్రిష్ 4 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రిష్ 4కి రాకేశ్ రోషన్ రైటర్ గా, నిర్మాతగా మాత్రమే పని చేస్తున్నాడు. హృతిక్ అగ్నిపథ్ సినిమా తెరకెక్కించిన కరణ్ మల్హోత్రా ఈ మూవీ డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

 

  Last Updated: 28 Oct 2023, 08:12 PM IST