Johnny Master Arrest : అత్యాచారం ఆరోపణల కేసులో జానీ మాస్టర్ (Johnny Master) ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా పోలీసులు జానీ కోసం గాలింపు చేస్తున్నారు. ఈరోజు ఆయన్ను గోవాలో అరెస్ట్ చేసి, స్థానిక కోర్టులో ఆయన్ను హాజరుపరిచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. జానీ గోవా లో ఉన్న విషయాన్నీ స్వయంగా ఆయన భార్యే పోలీసులకు తెలిపినట్లు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది.
జానీ మాస్టర్ గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ నాల్గు రోజుల క్రితం పిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. 2019 నుంచి తనపై జానీ వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంది. ఢీ షో ద్వారా జానీ మాస్టర్ పరిచయం అయ్యారని.. ఆ తర్వాత తనను ఆయన టీంలో చేర్చుకున్నారని తెలిపింది. ఔట్ డోర్ షూటింగ్ పేరుతో చెన్నై, ముంబై ,హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో… జానీ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశాడని బాధితురాలు తెలిపింది. షూటింగ్ స్పాట్‌లోనూ వదిలేవాడు కాదని.. కార్వాన్‌లోకి లాక్కెళ్లి.. ప్యాంట్ జిప్ తీసి.. చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. తను చెప్పిన దానికి అంగీకరించకపోతే.. అద్దానికి తన తల బాదేవాడని.. తీవ్రంగా దాడి చేసేవాడని.. ఇండస్ట్రీ లో ఛాన్సులు లేకుండా చేస్తానని బెదిరించే వాడని ఫిర్యాదులో తెలిపింది. జానీ మాస్టర్ ఎన్ని దారుణాలు చేసినా.. ఆయనకు ఎప్పుడూ తను లొంగిపోలేదని రాసుకొచ్చింది. మతం మార్చుకొని.. తనను పెళ్లి చేసుకోవాలని జాన్ మాస్టర్ వేధింపులకు పాల్పడేవాడని.. జానీ మాస్టర్‌కు ఆయన భార్య కూడా సహకరించేదని.. వాపోయింది. ఇంటికి వచ్చి మరీ ఆమె తనపై దాడి చేసిందని తెలిపింది. ఈమె పిర్యాదు తో జానీ మాస్టర్ తో పాటు అతడి భార్య ఫై కేసులు నమోదు చేసారు.
కాగా ఈరోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన జానీ భార్య అయోషా..కాసేపు నానా హడావిడి చేసిందట. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన మాస్టర్ భార్య ఆయన ఎక్కడ.. ? ఆయన్ను చూడాలి అంటూ వాదించిందట. అసలు విషయం ఏమిటంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ ఉన్నాడు అంటూ ఫేక్ కాల్ రావడంతో ఆమె అక్కడికి వచ్చిందట తప్పితే..ఆమెను పోలీసులు రమ్మని చెప్పలేదట. జానీ ని ఇంకా ఇక్కడికి తీసుకురాలేదని చెప్పడం తో ఆమె వెనుతిరిగి వెళ్లిపోయిందట. జానీ మాస్టర్ ఇంకా హైదరాబాద్ కు చేరుకోలేదని, గోవా నుంచి సిటీకి చేరుకోవడానికి ఇంకా టైం పడుతుందని చెప్పినట్టు సమాచారం. జానీ మాస్టర్ ను నేరుగా ఉపర్పల్లి కోర్టులో పోలీసులు హాజరు పరిచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి నిజంగా జానీ ని ఆయన భార్యే పోలీసులకు పట్టించిందా.? లేక ఫోన్ కాల్ ద్వారా ఏమైనా జానీ జడ తెలుసుకున్నారా..? అనేది పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Read Also : Jana Sena : పవన్ కళ్యాణ్‌తో బాలినేని, సామినేని ఉదయభాను భేటీ