Site icon HashtagU Telugu

Priyanka Chopra : తన మొదటి సినిమా సంపాదనతో ప్రియాంక చోప్రా ఏం కొన్నదో తెలుసా..?

Do you know what Priyanka Chopra bought with the earnings of her first film?

Do you know what Priyanka Chopra bought with the earnings of her first film?

స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) మోడల్ గా కెరీర్ ని స్టార్ట్ చేసింది. 2000వ సంవత్సరంలో మిస్‌ వరల్డ్‌ (Miss World) గా కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత బాలీవుడ్(Bollywood) లో సినిమా ఆఫర్లు అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన ఈ భామ భారీ క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి హాలీవుడ్(Hollywood) కి వెళ్లిపోయిన ప్రియాంక అక్కడే వరుస ఆఫర్లు అందుకుంటూ ముందుకు సాగుతుంది. అయితే ప్రియాంక తన మొదటి సంపాదనతో ఏం కొన్నదో తెలుసా..

ప్రియాంక చోప్రా.. తన మొదటి సినిమా పారితోషికంగా పెద్ద అమౌంట్‌నే అందుకుందట. తన మొదటి సంపాదనతో తనకి ఇష్టమైన వస్తువులు కొన్నట్లు ప్రియాంక చెప్పుకొచ్చింది. ముందుగా ఒక కారు కొనుకుందట. ఆ తరువాత ఖరీదైన ఉంగరం కొన్నట్లు చెప్పుకొచ్చింది. ఇలా మిగిలిన డబ్బుతో తనకి, తన పేరెంట్స్ కి ఇష్టమైనవి కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. అలా చేసినందుకు తాను ఎప్పుడు గర్వపడుతుంటాను అని చెప్పుకొచ్చింది. ప్రియాంక తల్లిదండ్రులు తనని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే వచ్చారని, వారి కోసం తన సంపాదనలో నుంచి ఖర్చు చేయడం తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపింది.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక హాలీవుడ్ కి వెళ్లిపోవడానికి.. బి టౌన్ లో జరిగే రాజకీయాలు కారణం అని ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక చెప్పుకొచ్చింది. ఇక హాలీవుడ్ వెళ్లిపోయిన ప్రియాంక అక్కడి సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనస్ ని (Nick Jonas) ప్రేమించి.. 2018 లో పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఇప్పుడు ఒక పాప కూడా ఉంది. ఆ పాప పేరు మాల్తీ మేరీ. సరోగసీ ద్వారా ప్రియాంక మాల్తీకి అమ్మ అయ్యింది.

 

Also Read : Adipurush : తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ టికెట్ రేట్లు.. ఎంత పెంచుతున్నారో తెలుసా? రేపే తెలుగు బుకింగ్స్ ఓపెనింగ్..