Site icon HashtagU Telugu

Vishnu : ‘మ్యాడ్’ ఫేమ్ లడ్డు సినిమాల్లోకి రాకముందు ఏం చేసావాడో తెలుసా..?

Mad Fame Vishnu

Mad Fame Vishnu

టాలీవుడ్‌కి ఇటీవల కాలంలో ఎంతోమంది ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. అలాంటి వారిలో విష్ణు (Vishnu) ఒకరు. ముఖ్యంగా ‘మ్యాడ్’ (MAD) చిత్రంలో లడ్డు పాత్రలో చేసిన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. కాలేజ్ జీవితాన్ని ఆ పాత్రలో ప్రతిబింబిస్తూ, తన అమాయకమైన హావభావాలతో తెరపైన నవ్వుల వర్షం కురిపించాడు. ఆ సినిమా హిట్ కావడంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విష్ణు, తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా నిర్వహించిన వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, ఈ సినిమా విజయంలో శంకర్ అంటేనే విష్ణు పాత్రే ప్రధానమని, ఇతని వల్లే సినిమాకి ప్రాణం వచ్చిందని ప్రశంసలు కురిపించాడు.

Salman Khan : పవన్ డైరెక్టర్ తో సల్మాన్ ..?

విష్ణు సినిమా రంగంలోకి అడుగుపెట్టే ముందు జీవితం చాలా సాధారణమైనది. ఆయన విజయ్ దేవరకొండతో ఒకే కాలేజీలో చదివాడు. విజయ్ డిగ్రీ నాల్గవ సంవత్సరం ఉండగా, విష్ణు మొదటి సంవత్సరం లో ఉండేవాడు. అప్పట్లోనే ఫోటోగ్రఫీకి, కామెడీకి ఆయనలో ఉన్న ఆసక్తి కాలేజీలో అందరికీ తెలుసునని, అదే సమయంలో పరిచయం పెరిగి స్నేహితులు అయినట్టు విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెల్లడించారు. ఈవెంట్‌లో ఆయన “టాక్సీవాలా సినిమాలో ఒక పాత్రకు కచ్చితంగా విష్ణుశూట్ అవుతాడని నమ్మి తీసుకున్నాం, అతని భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుందని అప్పుడే అనిపించింది” అని గర్వంగా పేర్కొన్నారు.

ఈరోజు విష్ణు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ‘మ్యాడ్’ సినిమాతో ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న విష్ణు, త్వరలో ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం కూడా అవార్డు కొట్టేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. అతని కెరీర్‌లో ‘మ్యాడ్’ సిరీస్‌ తప్పా, కీడా కోలా, హ్యాపీ ఎండింగ్, సరిపోదా శనివారం, డార్లింగ్, మా నాన్న సూపర్ హీరో, కోట బొమ్మాలి వంటి అనేక చిత్రాల్లో నటించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. కామెడీతో పాటు సహజ నటనతో అలరించగలిగే విశేషత ఉన్న ఈ యువ నటుడికి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు ఖాయం అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Exit mobile version