విలువుల పునాదులపై నిర్మించుకున్న గెలుపుబాటలో ముందుకు సాగిన రామోజీరావు (Ramoji Rao) ఇక లేరు. నిరంతర శ్రమ నిత్యం కొత్తదనం కోసం తపన నిజాయితీతో కూడిన వ్యాపారం పుట్టిన నేలకోసం, చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టిమేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం చెక్కు చెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలిసిన ఆధునిక రుషి రామోజీరావు. ఆరోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నఆయన ఈరోజు (జూన్ 8) తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీరావు అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ ఉన్నత స్థాయిని అధిరోహించారు.
We’re now on WhatsApp. Click to Join.
సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నో అద్భుత చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన, సినిమా షూటింగుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని వసతులు ఒకేచోట ఉండాలని భావించారు. అనుకున్నట్లుగానే ఆయన కలలుగన్న ఫాంటసీ ప్రపంచం రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు. చైతన్యదీప్తుల్లాంటి చిత్రరాజాలను సృజించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు. అలాంటి మహనీయుడు ఓ సినిమాలో కూడా నటించాడనే సంగతి చాలామందికి తెలియదు. చిన్న పని చేసే ప్రచారం చేసుకునే ఈరోజుల్లో మీడియా మొఘల్ గా పేరు తెచ్చుకున్న రామోజీరావు మాత్రం ఇంటర్వ్యూలు ఇవ్వరు. బయట సభల్లోనూ, సమావేశాల్లోనూ కనిపించరు. కానీ ఈయన ఓ సినిమాలో నటించాడు.
1978లో వచ్చిన ‘మార్పు’ (Marpu) అనే చిత్రంలో న్యాయమూర్తి పాత్రలో కాసేపు మెరిశారు రామోజీ. అప్పట్లో సినిమాలంటే రామోజీకి మక్కువగా ఉండేది. నటుడిగా తాను ఎలా ఉంటానో చూసుకోవాలన్న ఉత్సాహంతో ‘మార్పు’ అనే సినిమాలో కనిపించారు. కానీ తరవాత అలాంటి ప్రయత్నం చేయలేదు. 1984లో ఉషాకిరణ్ మూవీస్ స్థాపించారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన దాదాపు 90 చిత్రాల్లో ఒక్కదాంట్లో కూడా రామోజీరావు కనిపించలేదు. కనీసం సినిమా ఫంక్షన్లకూ ఆయన దూరంగా ఉండేవారు. ఉషాకిరణ్ మూవీస్ తీసిన సినిమాల గురించి కూడా పెద్దగా మాట్లాడేవారు కాదు. కేవలం సుమన్ బలవంతంపై ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్లలో కాస్త కనిపించేవారంతే..!!
Read Also : Ramoji Rao : రామోజీ రావు ను హింసించి హత్య చేసారు – వీహెచ్ సంచలన వ్యాఖ్యలు