అల్లు అర్జున్(Allu Arjun) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన చిత్రం ‘రేసుగుర్రం'(Race Gurram). సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథని అందించారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా శ్యామ్, రవి కిషన్, బ్రహ్మానందం, ముకేశ్ రిషి, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 2014లో రిలీజైన ఈ చిత్రం.. ఆ ఏడాది తెలుగు హైయెస్ట్ గ్రాసర్ మూవీ మాత్రమే కాదు, అల్లు అర్జున్ కి ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ మూవీగా కూడా నిలిచింది.
కాగా ఈ మూవీలోని మూడు ముఖ్య పాత్రలకు ఒకే నటుడు డబ్బింగ్ చెప్పారు. అల్లు అర్జున్ కి అన్నయ్యగా నటించిన తమిళ నటుడు శ్యామ్‌కి, విలన్‌గా నటించిన భోజపురి నటుడు రవి కిషన్‌కి, విలన్‌కి తండ్రిగా కనిపించిన హిందీ నటుడు ముకేశ్ రిషికి ఒకరే డబ్బింగ్ చెప్పారు. సరిగ్గా గమనిస్తే ఈ మూడు పాత్రల డైలాగ్ మాడ్యులేషన్ వేరేగా ఉంటుంది గానీ, వాయిస్ మాత్రం సేమ్ ఉంటుంది.
ఇంతకీ ఈ ముగ్గురు నటులకు డబ్బింగ్ చెప్పిన నటుడు ఎవరంటే.. బొమ్మాలి రవి శంకర్. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపుని సంపాదించుకున్న రవి శంకర్.. ఎన్నో గొప్ప పాత్రలకు తన వాయిస్ ని అందించి వారేవా అనిపించారు. ఇక ఈ సినిమాలో ఆ మూడు పాత్రలకు డబ్బింగ్ చెప్పినందుకు.. రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన సాయి కుమార్ తమ్ముడు అనే విషయం తెలిసిందే.
Also Read : Mahesh Babu : మహేష్ బాబు చేయాల్సిన సినిమా.. తరుణ్ చేశాడు..