Rashmika Mandanna: నేషనల్ క్రష్ ‘రష్మిక మందన్న’ బ్యూటీ సీక్రెట్స్ ఇవే..

రష్మిక ఏ క్రీమ్స్ వాడుతుందా? ఎలాంటి ఆరోగ్య రహస్యాలను పాటిస్తుంది? అనే విషయాలను తెలుసుకోవాలనుందా?

Published By: HashtagU Telugu Desk
Rashmika

Rashmika

నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna) అటు టాలీవుడ్, అటు బాలీవుడ్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. గీత గోవిందం, పుష్ప, మిషన్ మజ్ను లాంటి సినిమాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. కెమెరా ముందు, బయట ఎల్లప్పుడూ ఫ్రెష్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. అయితే రష్మిక (Rashmika Mandanna) ఏ క్రీమ్స్ వాడుతుందా? ఎలాంటి ఆరోగ్య రహస్యాలను పాటిస్తుంది? అనే విషయాలను తెలుసుకోవాలని ఆమె ఫ్యాన్స్ కు ఉంటుంది. అలాంటివాళ్ల కోసమే రష్మిక తన బ్యూటీ, ఫిట్ నెస్ సీక్రెట్ ను బయటపెట్టింది.

రష్మిక తన అందాన్ని (Beauty) కాపాడటంతో ఆకుకూరలకు ప్రాధాన్యం ఇస్తుందట. పోషకమైన ఆహారాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపుతుందట. “నేను ప్రతి రాత్రి పడుకునే ముందు ఫేస్ ను రెండుసార్లు శుభ్రం చేసుకుంటాను. అందుకే నేను మేకప్ లో అంత ఎందగా ఉంటుందో, తీసేసినా కూడా అంతే బ్యూటీగా కనిపిస్తాను. జుట్టు రక్షణ కోసం ఎక్కువగా ఆకుకూరలతో కూడిన పోషకాహారాన్ని తీసుకుంటాను” అని రష్మిక మందన్న చెప్పింది.

అయితే చాలామంది బయటకు వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. అందువల్లే గ్లామర్ త్వరగా పాడవుతుంది. అలాంటప్పుడు సన్‌స్క్రీన్ ను యూజ్ చేయాలని చెబుతోంది రష్మిక. ముఖ్యంగా ప్రయాణాలు, అవుట్‌డోర్ షూట్‌ల ఈ లోషన్ వాడుతుందట. ఆరోగ్యకరమైన వంటకాలు కూడా అందగా ఉంచుతాయని అంటోంది. ఇక శరీర రక్షణ కోసం వెచ్చని నూనె తో మసాజ్ చేయించుకుంటుందట. అంతేకాదు.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం బాగు ఉండటం కోసం ఇష్టమైన పాటలను వినాలని, అనవసర విషయాలను పట్టించుకోవదని చెబుతోంది (Rashmika Mandanna) రష్మిక.

Also Read: Pathaan@50: హాఫ్ సెంచరీ కొట్టిన పఠాన్.. అయినా తగ్గని షారుక్ క్రేజ్

  Last Updated: 16 Mar 2023, 12:31 PM IST