ఈ పైన కనిపిస్తున్న ఫొటోలో ఒళ్ళో బాబుని కూర్చోపెట్టుకొని కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా..? అతను తమిళంలో స్టార్ హీరో. తెలుగులో కూడా ఆ హీరోకి మంచి మార్కెట్ ఉంది. ఇక అతని వెనుక పింక్ డ్రెస్‌లో, నుదుటన విభూతి పెట్టుకొని కనిపిస్తున్న అమ్మాయి ప్రస్తుతం అతడి భార్య. ఇంకా గుర్తు పట్టలేకపోయారా..! ఆ హీరో ఎవరో కాదండి మన పక్కంటి కుర్రాడిలా కనిపించే శివకార్తికేయన్(Siva Karthikeyan) మరియు అతడి భార్య ఆర్తి(Aarthi). ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ తెగ వైరల్ అవుతుంది. అసలు శివకార్తికేయన్ కెరీర్ ఎలా మొదలైందో తెలుసా..?
శివకార్తికేయన్ చిన్నప్పటి నుంచే మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఇక తనలో ఈ టాలెంట్ ని గమనించిన స్నేహితులు అతని ఓ కామెడీ షోలో పాల్గొనమని చెప్పారు. దీంతో శివకార్తికేయన్ కూడా అటుగా ట్రై చేశాడు. ఈ క్రమంలోనే ‘కళక్క పోవతు యారు’ అనే తమిళ్ కామెడీ షోలో పాల్గొనే అవకాశం అందుకున్నాడు. అంతేకాదు ఆ షో విజేతగా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తరువాత ఐడెంటిటీ, ముగప్పుటగం, 360°, కురాహి 786.. వంటి షార్ట్ ఫిలింస్ చేశాడు. శివకార్తికేయన్ లో టాలెంట్ ని గుర్తించిన ఒక తమిళ్ మూవీ మేకర్ ‘ఏగన్’ అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు.
ఆ మూవీలో ఒక చిన్న పాత్ర చేయగా, అది కాస్త ఎడిటింగ్ లో పోవడంతో వెండితెర పై కనిపించాలనే తన కలకు మొదటిలోనే నిరాశ ఎదురైంది. ఆ తరువాత దర్శకుడు పాండిరాజ్.. శివకార్తికేయన్ ని ‘మెరీనా’ సినిమాతో హీరోగా పరిచయం చేశాడు. ఆ మూవీతో మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. ఇక అక్కడి నుంచి శివకార్తికేయన్ వెనుదిరిగి చూడలేదు. డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. ఇటీవల ‘ప్రిన్స్’ అనే సినిమాతో డైరెక్ట్ తెలుగు మూవీ చేశాడు.
ఇక తన భార్య తనకి చిన్నప్పటినుంచే బంధువులు అవడంతో అప్పట్లో ఇలా కలిసి తిరిగిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫోటో చుసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. చిన్నప్పుడు ఇద్దరూ భలే క్యూట్ గా ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Sai Pallavi: అమర్‌నాథ్ యాత్రలో సాయిపల్లవి, జీవితమే ఓ తీర్థయాత్ర అంటూ ఎమోషనల్!