Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఏపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫ్యాన్స్ కోసం ఒప్పుకున్న సినిమాలు మాత్రం ఎలాగైనా పూర్తిచేస్తానని మాట ఇచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ అని, మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడని తెలిసిందే. ఇటీవల ఓ తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన మార్షల్ ఆర్ట్స్ గురించి మాట్లాడాడు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను ప్రాణం పెట్టి కరాటే నేర్చుకున్నాను. నేను మార్షల్ ఆర్ట్స్ మైలాపూర్ లో నేర్చుకున్నాను. అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, శీహన్ హుస్సేన్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను అని చెప్పారు. చెన్నై దగ్గర్లో మైలాపూర్ అనే ఓ ఏరియా ఉంది. అక్కడ ఇండియాలోనే ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, కరాటే మాస్టర్ శీహన్ హుస్సేన్ దగ్గర పవన్ కళ్యాణ్ నేర్చుకున్నారు. శీహన్ హుస్సేన్ కరాటే మాస్టర్ మాత్రమే కాదు ఆర్చరీ కోచ్, పెయింటర్, నటుడు కూడా.
గతంలో శీహన్ హుస్సేన్ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. రోజూ నా దగ్గరకు కరాటే నేర్పించమని వచ్చేవాడు. నేను మొదట్లో నేర్పించను, నాకు ఖాళీ లేదు అన్నాను. అయినా రోజూ పొద్దున్నే వచ్చి నేర్చుకుంటే మీ దగ్గరే నేర్చుకుంటాను అని పట్టుబడ్డాడు. దాంతో నేను రోజు పొద్దున్నే 5 గంటలకు రావాలి, రాత్రి 11 గంటల వరకు వెయిట్ చేయాలి. నాకు కుదిరితే మధ్యలో ఒక అరగంట వచ్చి నేను నేర్పిస్తాను అని చెప్పాను. సరే అని చెప్పి రోజు వచ్చేవాడు, నాకు టీ చేసి చ్చేవాడు, బిల్డింగ్ క్లీన్ చేసేవాడు. అతని నిజాయితీ నచ్చి నేను మూడు నెలలు నేర్పించాను. ఆ తర్వాత అతను స్టార్ హీరో చిరంజీవి సొంత తమ్ముడు అని తెలిసి ఆశ్చర్యపోయాను అని చెప్పారు.
దీంతో పవన్ కళ్యాణ్ డెడికేషన్ ని మరోసారి ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన కరాటే, మార్షల్ ఆర్ట్స్ ని మొదటి సినిమా నుంచి అనేక సినిమాల్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. త్వరలో రానున్న OG లో కూడా మార్షల్ ఆర్ట్స్ చేయబోతున్నారు పవన్.
Also Read : Sai Durgha Tej : బ్లడ్ బ్యాంక్‌లో సాయి దుర్గ తేజ్ బర్త్ డే వేడుకలు..