Sitara Remuneration: సితార క్రేజ్.. జ్యువెలరీ యాడ్‌ కు కోటి రూపాయల రెమ్యునరేషన్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కూతురు సితారకు సోషల్ మీడియాలో ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది.

Published By: HashtagU Telugu Desk
Sitara

Mahesh Babu's Daughter Sitara In The Famous Times Square!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కూతురు సితారకు సోషల్ మీడియాలో ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఆకర్షణీయమైన డ్యాన్స్ వీడియోలకు పేరుగాంచిన సితార ఇటీవల ఒక కమర్షియల్ జ్యువెలరీ యాడ్‌లో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఓ యాడ్ లో కనిపించేందుకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రకటన కోసం ఆమె రికార్డు స్థాయిలో 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. సితార మొదటి ప్రకటన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కూడా ప్రదర్శించబడింది. ఆమె అంతర్జాతీయ గుర్తింపును ప్రదర్శిస్తుంది. నిజంగా సితారకు అద్భుతమైన విజయం. మొదటి యాడ్ లో కోటి రూపాయలు తీసుకుంటుండంతో మహేశ్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్తులో సితార హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

నిజానికి సితారకి అంతకు ముందే చాలా యాడ్స్ వచ్చాయట. కానీ మహేష్‌ నో చెబుతూ వచ్చారు. కానీ ఈ జ్యూవెల్లరీ యాడ్‌కి మాత్రం ఓకే చెప్పడానికి కారణం పారితోషికం అని తెలుస్తుంది. ఇక, కూతురి ఫోటోలను టైమ్‌ స్క్వైర్‌పై చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దానిని సోషల్ మీడియాలో కూడా తెలియజేసిన విషయం తెలిసిందే. తండ్రి గర్వపడుతున్నానంటూ ఎమోషన్ అయ్యారు.

Also Read: Pawan Kalyan: పవన్ ఎంట్రీతో ఇన్‌స్టా షేక్.. 2 మిలియన్ల ఫాలోవర్స్ తో సరికొత్త రికార్డ్!

  Last Updated: 06 Jul 2023, 02:56 PM IST