Site icon HashtagU Telugu

Kodi Ramakrishna : కోడి రామకృష్ణ తలకట్టు వెనుక ఉన్న కారణం ఏంటి..?

Do You Know Kodi Ramakrishna Head Band Secret

Do You Know Kodi Ramakrishna Head Band Secret

తెలుగు చిత్రసీమలో 100 సినిమాలకు దర్శకత్వం వహించిన అతి కొద్దిమంది దర్శకుల్లో కోడి రామకృష్ణ(Kodi Ramakrishna) కూడా ఒకరు. సాధారణంగా ఒక దర్శకుడు ఒకటి రెండు జోనర్స్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. కొందరు దర్శకులు సాహసం చేసి పలు జోనర్స్ ని టచ్ చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకున్న సందర్భాలు చాలా తక్కువ. కానీ కోడి రామకృష్ణ మాత్రం ఆల్మోస్ట్ అన్ని జోనర్స్ ని టచ్ చేస్తూ సమాజంలోని ప్రతి కోణంపై సినిమాలు తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు.

ఇక గ్రాఫిక్స్ విషయంలో కూడా ఆయన చేయని సాహసాలు, ప్రయోగాలు లేవు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాలకు సైతం దర్శకత్వం వహించారు. ఆయన సినిమాల విషయాలు ఇలా ఉంటే, కోడి రామకృష్ణ ఆహార్యం కూడా ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించేది. నుదుటికి ఒక కట్టు, చేతికి రక్షా తాళ్లు, వేళ్లకు ఉంగరాలతో ప్రత్యేకంగా కనిపించేవారు. సినిమా షూటింగ్స్, ఈవెంట్స్ లో మాత్రమే కాదు.. బయట ఇతర ఫంక్షన్స్, ఇంటర్వ్యూల్లో కూడా కోడి రామకృష్ణ తలకట్టుతో కనిపించేవారు.

ఆయన అలా నుదుటికి కట్టు కోవడం వెనుక ఉన్న కారణాన్ని ఒక సందర్భంలో తెలియజేశారు. ఆయన సెకండ్ మూవీ ‘తరంగిణి’ షూటింగ్ లో ఉన్న సమయంలో సీనియర్ ఎన్టీఆర్ మేకప్‌మ్యాన్‌ మోకా రామారావు ఒక మాట చెప్పారట. “మీ నుదుటి భాగం పెద్దగా ఉంది. ఎండ తగలకుండా కట్టు కట్టండి” అని చెప్పి ఒక తెల్ల కర్చీఫ్‌ ఇచ్చారట. ఆ రోజు కోడి రామకృష్ణ షూటింగ్ లో అలిసిపోకుండా ఉత్సాహంతో షూటింగ్ చేశారట. దీంతో నెక్స్ట్ డే ఒక బ్యాండ్‌ తయారు చేయించుకొని ధరించారట.

అలా ధరించిన సమయంలో ఒక పాజిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లు అనిపించేదట. ఇక ఒకసారి అగ్ర దర్శకుడు కె బాలచందర్‌.. “ఈ బ్యాండ్ మీకు ప్రత్యేక గుర్తింపుని ఇస్తుంది. ఇది మీ పూర్వజన్మ బంధానికి సంకేతం, దీనిని ఎప్పుడూ తీయకండి” అని చెప్పారట. అంతేకాదు కోడి రామకృష్ణకి సినిమా కథ విషయంలో సందిగ్ధంలో ఉన్నా, లేదు ఏదైనా ఎదురైనా.. నుదుటికి కట్టు కట్టగానే పరిష్కారం లభించేదట. దీంతో ఆ తల‘కట్టు’ ఒక సెంటిమెంట్ లా భావించి ఎప్పుడు ధరించే ఉండేవారట.

 

Also Read : Naga Chaitanya Thandel : నాగ చైతన్య తండేల్.. టైటిల్ వెనక రీజన్ అదేనా..!