సాధారణంగా స్టార్ హీరోయిన్స్ ట్యాగ్ ఉన్నవాళ్లు మెయిన్ పాత్రలు చేయడానికి మాత్రమే ఇష్టపడుతారు. సిస్టర్, ఫ్రెండ్ లాంటి పాత్రలు చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే ఒకే చెబుతారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్, ‘భోళా శంకర్’లో మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ ఇందుకోసం బాగానే పారితోషికం (రెమ్యూనరేషన్) తీసుకున్నట్లు సమాచారం.
“చిరంజీవికి చెల్లెలిగా నటించడానికి ఆమె రూ. 2.25 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఇతర హీరోయిన్స్ కూడా చెల్లి పాత్ర కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకునేలా బాటలు వేసింది. కీర్తి సురేష్‌కి టాలీవుడ్‌లో చాలా డిమాండ్ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారి వారి పాట’లో ‘దసరా’లో నానితో స్క్రీన్ షేర్ చేసింది.
తాజాగా భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. “ఆమె హీరోయిన్‌గా కొన్ని పెద్ద సినిమాల కోసం చర్చలు జరుపుతోంది. లేడీ ఒరియేంటెడ్ మూవీస్ ను సైతం చేస్తోంది. తెలుగులో పెద్ద స్టార్స్ తో చేయకపోయినప్పటికీ తమిళ చిత్రం ‘అన్నత్తే’లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు సోదరిగా కనిపించింది. కొంత గ్యాప్ తర్వాత, ‘భోళా శంకర్’ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ చేస్తోంది. రజనీకాంత్, చిరుతో కలిసి పనిచేసినప్పటికీ చెప్పుకున్న క్రేజ్ దక్కలేదు.
Also Read: Telangana Police: మొబైల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ టాప్, సిటీ పోలీసులకు డీజీపీ అభినందనలు