Site icon HashtagU Telugu

NTR : ఆ గేమ్‌లో ఎన్టీఆర్ ప్రొఫిషినల్ ప్లేయర్ అని మీకు తెలుసా..!

Do You Know Jr NTR is a Professional Player in a Game

Do You Know Jr NTR is a Professional Player in a Game

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) టాలెంట్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నతనంలోనే యాక్టింగ్ ని మొదలుపెట్టిన ఎన్టీఆర్.. ఎలాంటి ఎమోషన్ ని అయినా అవలీలగా పలికించగలరు. అలాగే చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్ లో ట్రైనింగ్ తీసుకున్న ఎన్టీఆర్.. డాన్సర్‌గా కూడా గ్రేట్ అనిపించుకున్నారు. అయితే కేవలం సినీ రంగంలోనే కాదు, ఎన్టీఆర్ కి క్రీడా రంగంలో కూడా ఎంతో అనుభవం ఉంది. క్రికెట్, బ్యాడ్మింటన్‌ తో పాటు పలు ఆటల్లో కూడా ఎన్టీఆర్ కి మంచి ప్రావిణ్యం ఉంది.

ముఖ్యంగా బ్యాడ్మింటన్‌(Badminton) గేమ్‌లో అయితే ఎన్టీఆర్‌కి ఎంతో టాలెంట్ ఉంది. 14 ఏళ్ళ వయసులో ప్రొఫిషినల్ ప్లేయర్స్ తో కలిసి టోర్నమెంట్స్ కూడా వాడేవారట. టాలీవుడ్ లోని మరో హీరో ‘సుధీర్ బాబు’ కూడా బ్యాడ్మింటన్‌ ప్లేయర్ అని అందరికి తెలిసిన విషయమే. చిన్నతనంలో ఎన్టీఆర్‌తో కలిసి సుధీర్ బాబు కూడా పలు టోర్నమెంట్స్ ఆడేవారట. ఈ విషయాన్ని సుధీర్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అంతేకాదు, ఎన్టీఆర్ ఆట తీరు గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు.

బ్యాడ్మింటన్‌ ఆడేటప్పుడు కాక్ కింద పడిపోతున్న సమయంలో బ్యాక్ షాట్ తో సర్వీస్ తీసి ప్రత్యర్థి ఆటగాడికి షాక్ ఇచ్చేవారట. ఇక ఈ షాట్ చూడడానికి జనాలు జోరుగా వచ్చేవారట. అంతేకాదు, సినిమాల్లో తొడ కొట్టి తన దమ్ముని ప్రత్యర్థికి ఎలా తెలియజేస్తారో.. ఆట ఆడుతున్న సమయంలో కూడా ప్రత్యర్థిని ఓడించిన తరువాత ఎన్టీఆర్ అలాగే తొడ కొట్టి తన దమ్ముని, విజయాన్ని అందరికి చూపించేవారట.

క్రీడా రంగంలో కూడా సూపర్ టాలెంట్ ఉన్న ఎన్టీఆర్ అటు వైపు కొనసాగకుండా.. తన తాత, తండ్రి లెగసీని ముందుకు తీసుకువెళ్లేందుకు నటన వైపు అడుగులు వేశారు. ఈక్రమంలోనే 18 ఏళ్ళ వయసులోనే హీరోగా సినీ కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు గ్లోబల్ స్థాయి వరకు చేరుకున్నారు.

Also Read : NTR : ఎన్టీఆర్ మీ ఇంటికి వస్తే.. ఇలా వంట చేసి భోజనం పెట్టండి..