Vikramarkudu: విక్రమార్కుడు సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తుందో ఎలా ఉందో మీకు తెలుసా!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలో విక్రమార్కుడు సినిమా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో

  • Written By:
  • Updated On - March 27, 2024 / 10:53 PM IST

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలో విక్రమార్కుడు సినిమా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో రవితేజ సరసన అనుష్క హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో అదరగొట్టిన రవితేజ మరో పాత్రలో అత్తిలి సత్తిబాబుగా తన కామెడీతో ఇరగదీశారు. రెండు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు మాస్ రాజా.

ఇక విక్రమార్కుడు సినిమాలో రవితేజ కూతురుగా నటించిన చిన్నారి గుర్తుందా? తన అమాయకపు మాటలతో రవితేజను నాన్న అంటూ పిలుస్తూ ఆకట్టుకుంది ఆ చిన్నది. విక్రమార్కుడు సినిమా తర్వాత పలు సినిమాల్లో ఆ చిన్నారి నటించింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్ష అనే హారర్ మూవీలోనూ నటించింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను భయపెట్టింది ఆ చిన్నారి. అయితే విక్రమార్కుడు సినిమా విడుదల అయి కొన్ని ఏళ్లు అవుతోంది. మరి ఈ సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Vg

ఆ చిన్నారి పేరు నేహా. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలల్లో నటించి మెప్పించింది ఆ చిన్నారి. ఆ తర్వాత చదువుల పై దృష్టి పెట్టి సినిమాలకు దూరం అయ్యింది. ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. ఈ చిన్నది అమెరికాలోని ఫ్లోరిడాలో నేహా జన్మించింది. కానీ ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. నేహా సినిమాల్లో నటించి దాదాపు 10ఏళ్ళు పైనే అయ్యింది. సినిమాల కంటే ఆమె తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. మొన్నీమద్యే ఎంబీబీఎస్ పూర్తి చేసింది నేహా. ఇప్పుడు ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.