Site icon HashtagU Telugu

SP Balasubrahmanyam : మొదటి పారితోషికం అందుకోగానే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏం చేశారో తెలుసా..?

Do You Know how SP Balasubrahmanyam spends his first Remuneration

Do You Know how SP Balasubrahmanyam spends his first Remuneration

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam) తన కెరీర్ లో దాదాపు యాభైవేల పైగా పాటల్ని పాడి సరికొత్త రికార్డుని నెలకొల్పారు. సంగీతం నేర్చుకోకపోయినా తన సుమధుర గాత్రంతో ఎన్నో మధురమైన పాటల్ని పాడి.. వాటి ద్వారా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎస్పీబీ. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా పాటల రూపంలో రోజూ వినిపిస్తూనే ఉంటారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ లాంగ్వేజ్స్ తో కలిపి మొత్తం 16 భాషల్లో ఆయన పాటలు పాడారు.

ఇక బాలు పాడిన మొదటి పాట అంటే.. ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రం ‘ఏమి ఈ వింత మొహం’ అనే పాటని పి సుశీలతో కలిసి పాడారు. ఇక ఈ పాటకు గాను ఎస్పీబీ.. రూ.300 రెమ్యురేషన్‌(Remuneration) తీసుకున్నారు. అప్పటిలో అత్యధికంగా ఘంటసాల 500 రూపాయలు పారితోషికం తీసుకునేవారు. మొదటి పాటకే బాలు మూడువందల రెమ్యూనరేషన్ అందుకోవడం గొప్ప అనే చెప్పాలి. ఇక ఆ మొదటి రెమ్యూనరేషన్ తో ఎస్పీబీ ఏం చేశారో తెలుసా..?

ఆ సమయంలో బాలసుబ్రహ్మణ్యంకి ఇంటి నుంచి వాళ్ళ నాన్న ప్రతి నెల రూ.80 పంపించేవారట. రెమ్యూనరేషన్ 300 రావడంతో.. నాన్న నుండి ఒక నాలుగు నెలలు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెగ సంబర పడ్డారట. ఇక అందుకున్న ఆ మొదటి రెమ్యూనరేషన్ ని చేతులో పట్టుకొని తన ఫ్రెండ్‌ మురళిని తీసుకోని డ్రైవిన్‌ వుడ్‌ల్యాండ్స్‌కి వెళ్లి గులాబ్‌జామూన్‌, మసాలాదోశ తిన్నారట. ఆ రోజుల్లో ఒక సాధారణ వ్యక్తి డ్రైవిన్‌ వుడ్‌ల్యాండ్స్‌కి వెళ్లి తినాలంటే చాలా డబ్బుతో కూడుకున్న విషయం అంటా.

ఆ తరువాత ఇద్దరు కలిసి జేమ్స్‌బాండ్‌ సినిమాకు వెళ్లారట. అప్పటి వరకు నాలుగు పైసల టికెట్ కొనుకొని సినిమా చూసే వాళ్ళు.. ఆ రోజు రూపాయి పావలా పెట్టి సినిమా చూశారట. ఇంటర్వెల్ లో మంచి నీళ్లు తాగే వారు ‘కోక్’ కొనుగోలు చేసుకొని తాగారట. ఇక వన్‌బైటూ కాఫీ బదులు చెరోకప్పు కాఫీ తాగి ఎంజాయ్ చేశారట. ఇలా మొదటి రెమ్యూనరేషన్ తో బాగా ఎంజాయ్ చేశారే తప్ప నాన్నకి కొంత డబ్బుని పంపించాలనే ఆలోచలన ఆ సమయంలో రాలేదని బాలు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

 

Also Read : Salaar : జపాన్‌లో కూడా సలార్ గ్రాండ్ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?