Site icon HashtagU Telugu

Actress Laya: నటి లయ అమెరికాలో ఎంత శాలరీ కి పని చేసిందో తెలుసా..?

Actress Laya Comments About Her Assets Detailsa

Actress Laya Comments About Her Assets Detailsa

Actress Laya: తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి హీరోయిన్ లయ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది లయ. ఎక్కువ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వచ్చిన సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయం పెంచుకుంది. కానీ అతి తక్కువ సమయంలో సినిమాలకు దూరం అయింది.

ఇక లయ జాతీయ స్థాయి చదరంగం క్రీడాకారిణి గా కూడా ఒక గుర్తింపు సొంతం చేసుకుంది. అంతేకాకుండా లయకు సంగీతం, డాన్స్ పట్ల మంచి అవగాహన ఉంది. ఇక లయ నటిగా మంచి హోదాలో ఉన్న సమయంలో అనగా 2006 లో డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని వివాహం చేసుకుంది. ఇక వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ప్రస్తుతం లయ తన ఫ్యామిలీతో అమెరికాలో లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలో స్థిరపడింది.

ఇక పెళ్లి తర్వాత లయ సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన ఫ్యామిలీని చూసుకుంటుంది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా రీల్స్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక రీల్ షేర్ చేయందే ఉండలేదు లయ. ఇప్పటికీ లయ అందంలో ఎటువంటి మార్పు లేదు. ఇదంతా పక్కన పెడితే అమెరికాలో లయ జాబ్ చేయగా ఆమె తీసుకున్న శాలరీ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.

ఇటీవలే లయ ఇండియా కి వచ్చి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని బాగా సందడి చేస్తుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జాబ్ గురించి కొన్ని విషయాలు బయట పెట్టింది. తను 2006లో పెళ్లి చేసుకోగా 2011లో ఐటీ సెక్టర్ లో జాబ్ చేశాను అని తెలిపింది. అలా నాలుగేళ్లు ఫుల్ టైం వరకు చేశాను అని.. ఇక అది ఇండియాలో ప్రముఖ ఐటీ సంస్థకు చేశాను అని తెలిపింది.

ఇక ఆ సమయంలో తన శాలరీ అన్ని టాక్స్లు పోగా 12000 డాలర్స్ అని తెలిపింది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.9,60,000. ఇక తను 2017 లో జాబు వదిలేసి ఆ తర్వాత డాన్స్ స్కూల్ పెట్టాను అని తెలిపింది. ఇక కోవిడ్ కారణంగా అది మానేసి సోషల్ మీడియాలో రీల్స్ చేయడం మొదలుపెట్టాను అని చెప్పుకొచ్చింది.