SP Balasubrahmanyam : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదటి పాటకు అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా..?

దాదాపు యాభైవేల పైగా పాటల్ని పాడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. తన తొలి పాటకి తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా..?

  • Written By:
  • Publish Date - October 26, 2023 / 09:30 PM IST

భౌతికంగా లేకపోయినా తన సుమధుర గాత్రంతో ఎన్నో మధురమైన పాటల రూపంలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(SP Balasubrahmanyam) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంగీతం నేర్చుకోకపోయినా ఎంతోమందికి సంగీత పాఠాలు నేర్పిన ఎస్పీబీ.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు మొత్తం 16 భాషల్లో ఆయన పాటలు పాడారు. ఆయన కెరీర్ లో దాదాపు యాభైవేల పైగా పాటల్ని పాడి అలరించారు. మరి ఇలాంటి గాయకుడు తన తొలి పాటకి తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా..?

ఈ విషయం గురించి ఎస్పీబీ గతంలో మాట్లాడుతూ.. ‘తొలి పారితోషికం, దానితో ఏం చేశారు’ అనే విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ అనే చిత్రానికి గాను ఫస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్నారు. 1967లో రిలీజ్ అయిన ఈ సినిమాలోని ‘ఏమి ఈ వింత మొహం’ పాటని పి. సుశీలతో కలిసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఇక ఈ పాటకు గాను రూ.300 రెమ్యురేషన్‌ తీసుకున్నారు. అప్పటిలో అత్యధికంగా ఘంటసాలగారు 500 రూపాయలు పారితోషికం తీసుకునేవారు. కాగా ఆ సమయంలో బాలసుబ్రహ్మణ్యంకి ఇంటి నుంచి వాళ్ళ నాన్న ప్రతి నెల రూ.80 పంపించేవారట.

మొదటి రెమ్యూనరేషన్ 300 రావడంతో.. నాన్న నుండి ఒక నాలుగు నెలలు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెగ సంబర పడ్డారట. ఇక అందుకున్న మొదటి రెమ్యూనరేషన్ ని చేతులో పట్టుకొని తన ఫ్రెండ్‌ మురళిని తీసుకోని డ్రైవిన్‌ వుడ్‌ల్యాండ్స్‌కి వెళ్లి గులాబ్‌జామూన్‌, మసాలాదోశ తిన్నారట. అలాగే జేమ్స్‌బాండ్‌ సినిమాకు వెళ్లారట. అప్పటి వరకు నాలుగు పైసల టికెట్ కొనుకొని సినిమా చూసే వాళ్ళు.. ఆ రోజు రూపాయి పావలా పెట్టి సినిమా చూశారు. ఇంటర్వెల్ లో మంచి నీళ్లు తాగే వారు కోక్ తాగారట. ఇక వన్‌బైటూ కాఫీ బదులు చెరోకప్పు కాఫీ తాగి ఎంజాయ్ చేశారట.

 

Also Read : Anchor Suma : మీడియాపై సుమ సెటైర్లు.. అనంతరం సారి చెప్పిన సుమ..