తమిళ్ స్టార్ హీరో ధనుష్(Dhanush).. స్టార్ డైరెక్టర్ కస్తూరి రాజా (Kasthuri Raja) వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ధనుష్ కి సినిమాలపై, నటనపై ఎటువంటి ఆసక్తి లేదు. తనకి అసలు హీరో అవ్వాలి అనే ఆలోచనే లేదు. ఇదే విషయాన్ని తన తండ్రి కస్తూరి రాజాకి కూడా చెప్పాడు. కానీ ఆయన ఆ మాట వినకుండా ధనుష్ ని బలవంతంగా హీరోని చేశారు. 2002లో తన కొడుకుని తానే పరిచయం చేస్తూ కస్తూరి రాజా తెరకెక్కించిన సినిమా ‘తుల్లువదో ఇలమై’ (Thulluvadho Ilamai). ఈ మూవీ విడుదలయ్యి హిట్ టాక్ ని కూడా తెచ్చుకుంది.
మూవీలోని ప్రేమ కథ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. కానీ ధనుష్ నటనకి మాత్రం ఆడియన్స్ నుంచి నెగటివ్ మార్కులు పడ్డాయి. అయితే ధనుష్ కి ఒక అలవాటు ఉంది. ఎవరైనా విమర్శించినా, నీ వల్ల కాదు అని చెప్పినా.. అది సాధ్యం చేసి చూపిస్తాడు. దీంతోనే తన పై వచ్చిన విమర్శలు అన్నిటికి సమాధానం చెప్పాలని నటుడిగా తాను ఏంటో చూపించి అందరి చేత శబాష్ అనిపించుకున్నాడు. అయితే ధనుష్ హీరో కాకుండా అసలు ఏం అవ్వాలి అనుకున్నాడో తెలుసా..?
ధనుష్ కి వంట చేయడం(Cooking) అంటే చాలా ఇష్టమంట. చిన్నప్పట్నుంచి ఇంట్లో వంటగదిలో అమ్మకి సహాయం చేస్తూనే, కొత్త వంటలంటూ ప్రయోగాలు చేశాడట. ఒక గొప్ప చెఫ్(Chef) కావాలన్నది తన లక్ష్యం. కానీ తండ్రి బలవంతం మీద సినిమాలోకి రావడం, ఆ తరువాత ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తుండడంతో తన లక్ష్యం మారిపోయిందని ధనుష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆడియన్స్.. ఒకవేళ ధనుష్ నిజంగా చెఫ్ అయ్యి ఉంటే మనం ఒక మంచి నటుడిని మిస్ అయ్యేవాళ్ళం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ధనుష్ ఒక నటుడు గానే కాదు రైటర్, డైరెక్టర్, సింగర్ కూడా. నటనపై ఆసక్తి లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సౌత్ టు నార్త్ సినిమాల్లో నటించడమే కాకుండా రెండు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పటికి కూడా ఖాళీగా ఉంటె ఇంట్లో గరిటె తిప్పుతాడట ధనుష్.
Also Read : Sameera Reddy : సినిమా ఇండస్ట్రీలో స్నేహితులు ఎవ్వరూ నాకు హెల్ప్ చేయలేదు.. చాలా బాధ వేసింది..