Site icon HashtagU Telugu

Tollywood: గెస్ట్ రోల్ కోసం భారీగా పారితోషికం డిమాండ్ చేసిన బాలీవుడ్ హీరో.. 8 నిమిషాల సీన్ కు ఏకంగా అన్ని కోట్లా?

Mixcollage 24 Feb 2024 09 09 Am 9030

Mixcollage 24 Feb 2024 09 09 Am 9030

బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరిగింది. తెలుగు సినిమా స్థాయి జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. దీంతో అన్ని ఇండస్ట్రీల చూపు టాలీవుడ్ పైనే పడింది. దాంతో ఇతర భాషల సంగతి పక్కన పెడితే టాలీవుడ్ లో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలే రూపొందుతున్నాయి. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియాలో సినిమాల వైపే ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో సౌత్ మూవీస్ చేసేందుకు బాలీవుడ్ యాక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో సైఫ్ అలీఖాన్ ఇప్పుడు దేవర సినిమా లోనూ నటిస్తున్నారు.

అలాగే కేజీఎఫ్ మూవీతో సంజయ్ దత్ దగ్గరవ్వగా, ఇప్పుడు ఓజీ సినిమాతో హీరో ఇమ్రాన్ హష్మీ సౌత్ అడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కానీ తెలుగు సినిమాల్లో అతిథి పాత్రల కోసం భారీగా డిమాండ్ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. బాలీవుడ్ నటుడు అతిథి పాత్రలో నటించేందుకు దాదాపు రూ. 35 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. అంటే నిమిషానికి రూ. 4.5 కోట్లు అన్నమాట. ఇంతకీ ఆ ప్రముఖ నటుడు ఎవరో కాదు.. హీరో అజయ్ దేవగన్. ఆర్ఆర్ఆర్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ఆ సీన్‌లో నటించినందుకు అజయ్ దేవగన్ 35 కోట్లు పారితోషికం తీసుకున్నాడట.

8 నిమిషాల సీన్‌కి నిమిషానికి 4.5 కోట్లు, 8 నిమిషాలకు 35 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం 8 నిమిషాల పాటు వచ్చే ఆ సీన్‌లో అజయ్‌ దేవగన్‌ క్యారెక్టర్‌ చాలా కీలకం. సినిమాలో కేవలం కొన్ని నిమిషాలే అయినా నటుడు అజయ్ దేవగన్ పాత్ర చాలా ముఖ్యమైనది. సాధారణంగా అజయ్ ఒక్కో సినిమాకు రూ. 35 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. అలాగే సినిమా లాభాల్లో అతడికి 50 శాతం ఇవ్వనున్నారట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఏంటి కేవలం ఎనిమిది నిమిషాల కోసం 4.5 కోట్లా అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్స్.

Exit mobile version