Site icon HashtagU Telugu

Tripti Dimri: యానిమల్ మూవీకి త్రిప్తి డిమ్రి ఎంత రెమ్యూనరేషన్ అందుకుందో తెలుసా?

Mixcollage 14 Mar 2024 12 56 Pm 7800

Mixcollage 14 Mar 2024 12 56 Pm 7800

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన చిత్రం యానిమల్. గత ఏడాది విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎన్నో విమర్శలను ఎదుర్కొని చివరికి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ గా నిలిచింది యానిమల్ మూవీ. తండ్రి ప్రేమ కోసం ఆరాటపడే కొడుకు కథే ఈ చిత్రం. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రి కీలకపాత్రల్లో నటించారు. కాగా ఈ మూవీతో త్రిప్తి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించినప్పటికీ ఆమె కంటే త్రిప్తి దిమ్రీనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది.

ఎందుకంటే ఆయన పోషించిన పాత్ర అలాంటిది మరి. గెస్ట్ అప్పియరెన్స్ అయినా సెన్సేషనల్ టాక్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో నటించినందుకు త్రిప్తి ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుందంటూ ప్రచారం నడిచింది. కానీ అసలు ఎంత తీసుకుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు త్రిప్తి రెమ్యునరేషన్ విషయం ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతుంది. యానిమల్ సినిమా కోసం త్రిప్తి రూ. 40 లక్షలు పారితోషికం తీసుకుందట ఈ ముద్దుగుమ్మ. యానిమల్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన త్రిప్తి జోయా పాత్రలో గ్లామరస్ ‏గా కనిపించింది.

ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె కనిపించిన బోల్డ్ సీన్స్‏తో ఒక్కసారిగా పాపులారిటీ పెరిగింది. దీంతో త్రిప్తి గురించి సోషల్ మీడియాలో సెర్చింగ్ స్టార్ట్ చేశారు. ఈ మూవీ తర్వాత త్రిప్తికి బాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పుడు ఆమెను వెతుక్కుంటూ ఆఫర్స్ వస్తున్నాయి. భూల్ భూలయ్య 3, ఆషికీ 3 వంటి చిత్రాల్లో నటించింది. కాగా యానిమల్ తర్వాత త్రిప్తి పేరు సోషల్ మీడియాలో తరచుగా వినిపిస్తూనే ఉంది.

Exit mobile version