Sobhita – Samantha : నాగచైతన్య – సమంత విడిపోయిన కొన్నాళ్ళకు చైతు లైఫ్ లోకి శోభిత వచ్చి అందరికి షాక్ ఇచ్చింది. చైతు – శోభిత డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ వచ్చినప్పుడు ఎవరూ నమ్మలేదు. కానీ అధికారికంగా వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత అందరూ షాక్ అయ్యారు. దీంతో సమంతతో విడిపోయాక నాగ చైతన్య శోభితతో ప్రేమలో పడ్డట్టు అందరికి తెలిసింది.
ఇక నాగచైతన్య – శోభిత పెళ్లి డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు. శోభిత హల్దీ ఫంక్షన్, పెళ్లి కూతురిని చేసిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫ్యాన్స్ వీరిద్దరి పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే శోభిత ధూళిపాళ లైఫ్ లో నాగచైతన్య మాజీ భార్య సమంతనే కాకుండా మరో సమంత కూడా ఉంది.
ఆ సమంత ఎవరో కాదు శోభిత సొంత చెల్లి. శోభితకు ఒక చెల్లి ఉంది. ఆమె పేరు కూడా సమంతనే. సమంత ధూళిపాళ డాక్టర్. ఇప్పటికే మరో డాక్టర్ ని పెళ్లి చేసుకుంది. సమంత ధూళిపాళ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తుంది. శోభిత – నాగచైతన్య 2022 నుంచి ప్రేమలో ఉన్నారని సమంత ధూళిపాళనే గతంలో తెలిపింది.
ఇప్పుడు అక్క పెళ్లి పనుల్లో సమంత బిజీగా ఉంది. ఇప్పటికే శోభిత హల్దీ ఫంక్షన్, పెళ్లి కూతురిని చేసిన ఫోటోలు తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. అక్క పెళ్లిలో సందడి అంతా సమంతదే. సమంతతో విడాకులు అయినా నాగచైతన్య లైఫ్ ఇంకో సమంత ఇలా శోభిత చెల్లి రూపంలో రావడం గమనార్హం.
Also Read : Pushpa 2 Team Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కలిసిన పుష్ప 2 టీమ్? ఆంధ్రాలో టికెట్ రేట్లు పెరిగేనా?