Tillu 2 : బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న టిల్లు..’అట్లుంటది టిల్లుతోని’

టిల్లు రెండో రోజు బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టి... తొలి రెండు రోజుల్లో రూ.45.3 కోట్లు వసూళ్లు చేసి 'అట్లుంటది టిల్లుతోని ' అనేలా కుమ్మేస్తున్నాడు

  • Written By:
  • Publish Date - April 1, 2024 / 09:03 AM IST

బాక్స్ ఆఫీస్ వద్ద టిల్లు హావ మాములుగా లేదు..గత కొద్దీ రోజులుగా సరైన బొమ్మ లేక సినీ లవర్స్ నిరాశలో ఉండగా…అసలైన బొమ్మ చూపిస్త అంటూ టిల్లు వచ్చి..సినీ లవర్స్ కు ఫుల్ మిల్స్ పెట్టాడు..రొమాన్స్ , లవ్ , కామెడీ , సాంగ్స్ , ట్విస్ట్ లు అబ్బో..టిల్లు లో చాలానే ఉన్నాయే అని మాట్లాడుకునేలా టిల్లు స్క్వేర్ ఉండడం తో థియేటర్స్ వద్ద ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం కొనసాగుతుంది.

సిద్ధూ జొన్నలగడ్డ (Siddu ) , అనుపమ (Anupama ) జంటగా మల్లిక్ రామ్ (Mallik Ram) డైరెక్షన్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన మూవీ ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). భారీ అంచనాల నడుమ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘డీజే టిల్లు’ మూవీ తో ‘టిల్లు’గా యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. ఈ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ (Tillu Square) అంటూ వచ్చాడు. ఈ మూవీ కోసం గత కొద్దీ నెలలుగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. వారి ఎదురుచూపులు తగ్గట్లే సినిమా ఉండడం..అంచనాలకు రెట్టింపుగా ఉండడం తో ఫ్యాన్స్, సినీ లవర్స్ సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సినిమా చూసిన ప్రతి ఒక్కరు టిల్లు కుమ్మేసాడని..అనుపమ గ్లామర్ తో చూపు తిప్పుకోకుండా చేసిందని.. డీజే టిల్లు సినిమాకు మించి.. ఇందులో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని .. కామెడీ , యాక్షన్ , లవ్ , రొమాన్స్ ఇలా అన్ని మిక్స్ చేసి ప్రేక్షకులకు ఫుల్ వినోదాన్ని పంచారని చెపుతుండడం తో సినిమాను చూసేందుకు ప్రతి ఒక్కరు థియేటర్ కు క్యూ కడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం నడుస్తుంది. టిల్లు రెండో రోజు బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టి… తొలి రెండు రోజుల్లో రూ.45.3 కోట్లు వసూళ్లు చేసి ‘అట్లుంటది టిల్లుతోని ‘ అనేలా కుమ్మేస్తున్నాడు. నిన్న ఆదివారం కూడా అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ తో రన్ అయ్యాయి. మూడో రోజుకు సంబదించిన కలెక్షన్స్ కూడా బయటకు రానున్నాయి.

రెండో రోజు ఏరియా వైజ్ కలెక్షన్స్

నైజాంలో రూ. 3.97 కోట్లు
సీడెడ్‌లో రూ. 96 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ. 91 లక్షలు
ఈస్ట్ గోదావరిలో రూ. 38 లక్షలు
వెస్ట్ గోదావరిలో రూ. 24 లక్షలు
గుంటూరులో రూ. 37 లక్షలు
కృష్ణాలో రూ. 35 లక్షలు
నెల్లూరులో రూ. 18 లక్షలతో కలిపి.. రూ. 7.36 కోట్లు షేర్, రూ. 12.05 కోట్లు గ్రాస్ వచ్చింది.కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 2 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 25.11 కోట్లు షేర్‌తో పాటు రూ. 43.70 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Read Also :  DC Vs CSK: 16 బంతుల్లో 37 పరుగులు, ధోనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ