బాక్స్ ఆఫీస్ వద్ద టిల్లు ప్రభంజనం నడుస్తుంది..ఎక్కడ చూసిన..ఎవరి మాట విన్న అన్న టిల్లు 2 సినిమా చూడాల్సిందే అంటున్నారు. సిద్ధూ జొన్నలగడ్డ (Siddu ) , అనుపమ (Anupama ) జంటగా మల్లిక్ రామ్ (Mallik Ram) డైరెక్షన్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన మూవీ ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). భారీ అంచనాల నడుమ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘డీజే టిల్లు’ మూవీ తో ‘టిల్లు’గా యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. ఈ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ (Tillu Square) అంటూ వచ్చాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ మూవీ కోసం గత కొద్దీ నెలలుగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. వారి ఎదురుచూపులు తగ్గట్లే సినిమా ఉండడం..అంచనాలకు రెట్టింపుగా ఉండడం తో ఫ్యాన్స్, సినీ లవర్స్ సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం నడుస్తుంది. వీకెండ్ లోనే కాదు వీక్ డేస్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో టిల్లు దూకుడు కనపరుస్తున్నారు. నాలుగు రోజుల కలెక్షన్స్ అన్ని సెంటర్లలో సినిమాను బ్రేక్ ఈవెన్ స్థాయికి తీసుకువెళ్లింది. మొత్తం నాలుగు రోజుల్లో ఈ సినిమాకు రూ.78కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీటీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఇదే జోరును కొనసాగిస్తే రెండో వారం ముగిసిపోక ముందే రూ.100 కోట్లు అందుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also : Chiranjeevi : నాగబాబును కొట్టిన చిరంజీవి..ఎందుకంటే..!!